హైదరాబాద్ కు వస్తే న్యూయార్క్​లో ఉన్నామా? అనిపిస్తది: రజనీకాంత్​

హైదరాబాద్ కు వస్తే న్యూయార్క్​లో ఉన్నామా? అనిపిస్తది:  రజనీకాంత్​

ఎన్టీఆర్ శతజయంతోత్సవాలు విజయవాడలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ చీఫ్‌ చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, నటుడు రజనీకాంత్‌ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సినీ నటుడు రజనీకాంత్​ మాట్లాడుతూ ఎన్టీఆర్​ తో తనకు ఉండే సంబంధాన్ని వివరించారు. అనుభవం ఏం మాట్లాడాలో చెబుతుందన్నారు. తనకు ఆరేళ్ల వయస్సులో ఎన్టీఆర్​ నటించిన పాతాళ భైరవి సినిమా చూశానని ప్రకటించారు. 18 ఏళ్ల వయస్సులో స్టేజీపై ఎన్టీఆర్​ ను ఇమిటేట్​ చేశానన్నారు. 1966 శ్రీకృష్ణపాండవీయం చూసి ఎన్టీఆర్​ను ఇమిటేట్​ చేశానని  చెప్పారు.  1977లో ఎన్టీఆర్​ తో టైగర్​ సినిమాలో నటించానన్నారు.  తాను మొదటి సారిగా భైరవి సినిమాలో నటించానని తెలిపారు. ఎన్టీఆర్​ నటించిన దానవీరశూరకర్ణ సినిమాను ఎన్నిసార్లు చూశానో తెలియదన్నారు.  సినిమాల్లో కాకుండా రాజకీయాల్లో ఎన్టీఆర్​ రికార్డు సృష్టించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన కొద్ది రోజులకే అధికారంలోకి తెచ్చి తెలుగు ప్రజల ఆదరాభిమానాలకు పాత్రులయ్యారని తెలిపారు. 1983లో ఎన్టీఆర్​ గెలిచినప్పడు గంతులేశానని సభలో తెలిపారు.

చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఇది రాజకీయ సభ కాకపోయినా చంద్రబాబు ఉన్నారు కాబట్టి మాట్లాడాలని రజనీకాంత్​ అన్నారు.  చంద్రబాబు తనకు 30 ఏళ్ల మిత్రుడన్నారు.  మోహన్​ బాబు పరిచయం చేశారని చెబుతూ.. హైదరాబాద్​ వచ్చినప్పుడల్లా ఆయనను కలిసేవాడినని తెలిపారు.  చంద్రబాబు ప్రపంచ రాజకీయాలు బాగా తెలుసన్నారు.  విజన్​ 2020గురించి గతంలోనే ఆలోచించారని... ఐటీ ప్యూచర్​, డిజిటల్​ వరల్డ్​ను హైదరాబాద్​ కు తీసుకొచ్చి హైటెక్​ సిటీని స్థాపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.  హైటెక్​ సిటిలో ఉన్నప్పుడు.. ఇండియాలో ఉన్నామా.. న్యూయార్క్​లో ఉన్నామా అర్దం కాని పరిస్థితి నెలకొందని చంద్రబాబు సేవలను కొనియాడారు.  చంద్రబాబు కృషి వల్లే ఐటీ ఉద్యోగులు లగ్జరీగా బతుకుతున్నారని  ఎన్టీఆర్ శతజయంతి సభలో రజనీకాంత్​ అన్నారు.