గలాటా చేయనున్న నాగార్జున.. మళ్ళీ డాన్స్ మాస్టారే

గలాటా చేయనున్న నాగార్జున.. మళ్ళీ డాన్స్ మాస్టారే

కింగ్ నాగార్జున(Nagarjuna) కొత్త సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆయన హీరోగా వచ్చిన ప్రీవియస్ మూవీ ఘోస్ట్ బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్టైలీష్ యాక్షన్ త్రిల్లర్ ఆడియన్స్ ను చాలా డిసప్పాయింట్ చేసింది. దీంతో తన తరువాతి సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నాగార్జున. ఇందులో భాగంగానే తన తరువాతి సినిమాను ప్రముఖ రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ తో చేయనున్నారు అనే వార్తలు బలంగా వినిపించాయి. 

అయితే తాజా సమాచారం మేరకు నాగార్జున తన తరువాతి సినిమా కోసం కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని సెలెక్ట్ చేసుకున్నాడట. ఇందుకోసం రెండు అషన్స్ పెట్టుకున్నాడట నాగ్. అందులో ఒకటి పోరంజు మరియం జోస్ సినిమాను రీమేక్ కాగా.. మరొకటేమో కొత్త కథ. ఈ మధ్య కాలంలో రీమేక్స్ పెద్దగా వర్కౌట్ అవడం లేదు కాబట్టి.. కొత్త కథనే తీసుకునే అవకాశం ఉందని టాక్. ఈ సినిమాకు గలాటా అనే మాస్ టైటిల్ ను పరిశీలిస్తున్నారట. దీని సంబందించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.  

నిజానికి డాన్స్ మాస్టర్ సెంటిమెంట్ నాగార్జునకు బాగానే కలిసి వచ్చింది. ఇప్పటికే రాఘవ లారెన్స్ తో మాస్ సినిమాను చేసి సూపర్ హిట్ అందుకున్నాడు నాగార్జున. ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ తన తరువాతి సినిమా కోసం మళ్ళీ కొరియోగ్రాఫర్ నే సెలెక్ట్ చేసుకున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో అయినా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.