2 కోట్ల చైనా ఫోన్లలో డేంజర్ వైరస్

2 కోట్ల చైనా ఫోన్లలో డేంజర్ వైరస్

చైనా దిగ్గజ కంపెనీ జియోని భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే 2 కోట్లకుపైగా ఫోన్లలో ట్రోజన్ హార్స్ అనే వైరస్ ప్రవేశపెట్టినట్లు వెల్లడైంది. అప్ డేట్ నెపంతో ఈ హానికర వైరస్ ను ఇన్ బిల్ట్ చేసింది. అందుకు జియోని 40 లక్షల డాలర్ల ముడుపులు పుచ్చుకుందట. చైనా న్యాయస్థానం గ్జూలీ. జో-యింగ్, జియా, పాన్ క్విలను దోషులుగా తేల్చింది. వారికి 3-3.5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 30 వేల డాలర్ల జరిమానా విధించింది.