- దర్భ ప్రైమరీ స్కూల్ పునఃప్రారంభం
నేరడిగొండ, వెలుగు: జీరో ఎన్‌రోల్‌మెంట్ కారణంగా గత కొంతకాలంగా మూతబడ్డ ప్రభుత్వ పాఠశాలలకు మళ్లీ పూర్వవైభవం వస్తోంది. నేరడిగొండ మండలంలోని దర్భ గ్రామంలో గత నాలుగేండ్లుగా మూతబడ్డ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ ను సోమవారం ఎంఈఓ భూమారెడ్డి తిరిగి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లలో అనుభవజ్ఞులైన టీచర్లతోపాటు నాణ్యమైన విద్య అందుతోందన్నారు.
కార్పొరేట్ స్థాయికి దీటుగా చదువుతో పాటు విద్యార్థులకు ప్రతీ రోజూ రుచికరమైన, పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందిస్తోందని, గ్రామస్తులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని సూచించారు. అనంతరం స్కూల్ లో చేరిన విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు
