పాన్ ఇండియా సినిమాగా విడుదల కానున్న దాస్ కా ధమ్కీ

పాన్ ఇండియా సినిమాగా విడుదల కానున్న దాస్ కా ధమ్కీ

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియా చిత్రం  ‘దాస్‌‌ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్ హీరోయిన్. విశ్వక్ తండ్రి కరాటే రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌‌‌‌, సాంగ్స్‌‌తో ఇంప్రెస్ చేసిన టీమ్.. గురువారం సినిమా విడుదల తేదీని ప్రకటించింది.  మార్చి 22న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో వరల్డ్‌‌వైడ్‌‌ థియేటర్స్‌‌లో రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌లో విశ్వక్ పాత్రలోని రెండు షేడ్స్‌‌ని చూపించడం ఆసక్తికరంగా ఉంది. ఇందులో  క్లాస్‌‌తో పాటు మాస్ అవతార్‌‌లో కనిపిస్తున్నాడు విశ్వక్ సేన్.  ఈ రొమాంటిక్‌‌ కామెడీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌కు ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాయగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.