నటేశ్వర శర్మకు దాశరథి అవార్డు

నటేశ్వర శర్మకు దాశరథి అవార్డు
  • 22న రవీంద్ర భారతీలో ప్రదానం

హైదరాబాద్, వెలుగు : ప్రముఖ కవి, రచయిత, శతావధాని అయాచితం నటేశ్వర శర్మను దాశరథి కృష్ణమాచార్య అవార్డుకు ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కామారెడ్డి జిల్లాకు చెందిన నటేశ్వర శర్మకు.. ఈనెల 22న రవీంద్రభారతిలో నిర్వహించే దాశరథి జయంతి ఉత్సవాల్లో అవార్డుతో పాటు రూ.1,00,116 నగదు అందజేయనున్నారు. 

దాశరథి అవార్డుకు ఎంపికైన నటేశ్వర శర్మను సీఎం కేసీఆర్ అభినందించారు. సాహిత్య రంగంలో విశేషంగా కృషి చేసిన వారికి ప్రతి ఏటా దాశ‌ర‌థి జ‌యంతి (జులై 22) రోజున ఈ అవార్డును రాష్ట్ర సర్కార్ ప్రదానం చేస్తుంది. 2015 నుంచి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నది.