- బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో బీసీలకు రూ. 30 వేల కోట్లు కేటాయించాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ డిమాండ్ చేశారు. బాగ్ లింగంపల్లిలో గురువారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. బీసీలకు 2025–26 బడ్జెట్‌లో ప్రకటించిన రూ.11, 450 కోట్లను పూర్తిగా వినియోగించాలన్నారు.
రెండు వార్షిక బడ్జెట్లలో బీసీల కోసం మొత్తం రూ.20 వేల కోట్లు కేటాయించినప్పటికీ రూ.3 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు. బీసీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు.
