అమ్మకానికి 50 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల డేటా

అమ్మకానికి 50 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల డేటా

అమ్మకానికి 50 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల డేటా అందుబాటులో ఉందని ఒక హ్యకర్ సంస్థకు చెందిన వ్యక్తి తెలిపాడు. యూజర్ల డేటాతో పాటు వారి ఫోన్ నెంబర్లు మరియు ఇతర డేటా కూడా తమ దగ్గర ఉందని సదరు హ్యకర్ తెలిపాడు. ఇజ్రాయెల్ సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ సంస్థ హడ్సన్ రాక్ కో ఫౌండర్ అలోన్ గాల్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఈ డేటాబేస్ జనవరి నుంచి హ్యాకర్ సర్కిళ్లలో తిరుగుతుందని తెలుస్తోంది. నాకు తెలిసిన కొంతమంది ఫోన్ నెంబర్లను క్రాస్ చెక్ చేశాను. అవి హ్యకర్ల దగ్గర ఉన్న డేటాతో సరిపోలాయి. సోషల్ మీడియాను వాడే వ్యక్తులు.. సైబర్ దాడుల నుంచి జాగ్రత్తగా ఉండాలి’ అని గాల్ సూచించారు. అయితే దీనిపై స్పందించిన ఫేస్‌బుక్ కంపెనీ మాత్రం ఈ డేటా.. 2019లో బయటకు వచ్చిన డేటా అని.. కొత్తది కాదని ఒక ప్రకటనలో తెలిపింది.