- బోర్ కొడుతోందా.. నిద్ర పట్టడం లేదా అంటూ గాలం
- ‘డబ్బులక్కర్లేదు రా అయ్యా’ అంటూ అన్నీ దోచేస్తున్నారు
అమ్మాయిలతో మాట్లాడవచ్చని మల్కాజిగిరికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ డేటింగ్ యాప్ లో ఎంటరయ్యాడు. అక్కడ ‘శిక్ష’ అనే యువతి టచ్‌లోకి వచ్చింది. పరిచయాలు, ఇష్టాఇష్టాలు తెలుసుకున్నాక ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు సదరు యువతి మాట్లాడుతూ మాట్లాడుతూ...‘న్యూడ్వీడియో కాల్ఓకేనా’ అని అడిగింది. అతడు ఒకే చెప్పడంతో మొత్తం రికార్డ్చేసింది. టెలిగ్రామ్‌లో లింక్పంపింది. అతడు ఓపెన్‌చేయగా ఫోన్హ్యాక్అయి కాంటాక్ట్ లిస్ట్ చేతికి చిక్కింది.
డబ్బులివ్వాలని లేకపోతే వీడియోలను కాంటాక్ట్‌లిస్ట్‌లో ఉన్నవారికి పంపుతానని బెదిరించింది. మోసపోయానని తెలుసుకున్న అతడు రూ. 2 .50 లక్షలు ఇచ్చి సెటిల్చేసుకుందామని కోరాడు. అప్పుడు సరేనన్న యువతి కొద్ది రోజులకు మరిన్ని డబ్బుల కోసం వేధించింది. అతడు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో అతడి కాంటాక్ట్ లిస్టులోని కొందరికి న్యూడ్‌వీడియోలు షేర్ చేసింది. మరింత మందికి వీడియోలు పంపిస్తానని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించాడు.
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇన్‌స్టా, యూట్యూబ్ఓపెన్చేస్తే చాలు ‘బోర్ కొడుతోందా.. రాత్రి పూట ఒక్కరికే నిద్ర పట్టడం లేదా అయితే మీ కోసమే మా యాప్. కింద ఇచ్చిన లింక్ ను ఓపెన్ చేసి గంటల తరబడి మాతో మాట్లాడండి..మీకు మేము ఎక్కడా బోర్ కొట్టనివ్వం. డబ్బులక్కర్లేదు రా అయ్యా.. ముందు లింక్ ఓపెన్ చేయ్.. నేమ్ సేవ్ చేసుకో.. అమ్మాయిలు, అంటీలతో మాట్లాడుకో’ అంటూ ఏఐ జనరేటెడ్అమ్మాయిలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు.
రొమాన్స్ చాట్ పేరుతో పద్ధతిగా ఉన్న యువతులు అందంగా నవ్వుతూ మాట్లాడుతున్న వీడియోలను చూస్తున్న కుర్రకారు అట్రాక్ట్అవుతున్నారు. అమ్మాయిలతో మాట్లాడాలన్న కక్కుర్తితో తప్పులో కాలేసి మోసపోతున్నారు. ముందు నమ్మించి వివరాలన్నీ తెలుసుకుంటున్న అమ్మాయిలు, ఆంటీలు తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేసి అందినకాడికి దండుకుంటున్నారు.
ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్చేసి...
మన దగ్గర చాలా డేటింగ్స్యాప్స్అందుబాటులో ఉండగా, ఎక్కువగా టిండర్, బంబుల్, హింగే, ఓకే క్యూపిడ్, హ్యాప్పెన్ వంటి వాటిని యూత్ఎక్కువగా వాడుతోంది. ఇవి ఎక్కువగా ప్రాంతీయ భాషల్లో కూడా సేవలు అందిస్తుండడంతో ఒంటరితనం పోగొట్టుకోవడానికి యువత ఎగబడుతున్నారు. ఎంతలా అంటే సోషల్ మీడియా వాడే సుమారు 75 శాతం మంది మధ్యలో ఏఐతో క్రియేట్‌చేసే డేటింగ్యాప్స్యాడ్స్కనిపిస్తే అక్కడే ఆగిపోతున్నారు. దీంతో అందరికీ స్క్రోల్చేస్తుంటే ఇలాంటి వీడియోలే వస్తున్నాయి. దీన్ని క్యాష్చేసుకోవాలనుకుంటున్న కొందరు డేటింగ్యాప్స్లో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు.
ఆకర్షణీయమైన ఫొటోలు, వీడియోలు పెట్టి వాయిస్‌కాల్స్, చాటింగ్ చేస్తున్నారు. తర్వాత ముగ్గులోకి లాగి అత్యవసర పరిస్థితులంటూ మొత్తం లాగేసుకుంటున్నారు. హాస్పిటల్ఖర్చులని, అమ్మకు ఆరోగ్యం బాగాలేదని ఇలా రకకరకాల కారణాలు చెప్తూ జేబులు ఖాళీ చేస్తున్నారు. వీడియో కాల్స్ మాట్లాడేవారిని న్యూడ్కాల్స్దాకా తీసుకువెళ్లి రికార్డ్‌చేసి బ్లాక్మెయిల్చేస్తున్నారు. బయట తెలిస్తే పరువు పోతుందని అడిగినంతా సమర్పించుకుంటున్నారు. ఇలా 2025లో సుమారు 569 కేసులు నమోదయ్యాయని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనల్లో బాధితులు రూ.2.8 కోట్లకు పైగా నష్టపోయారు. ముఖ్యంగా సిటీలోని సైబర్ క్రైమ్ పోర్టల్, హెల్ప్‌లైన్లకు రోజూ ఇలాంటి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.
ఫేక్ యాప్ లతోనూ...
మన దేశంలో డేటింగ్ యాప్‌లకు ప్రత్యేక లైసెన్స్ వ్యవస్థ లేకపోయినా, అధికారిక యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంటూ లీగల్‌గానే పనిచేస్తున్నాయి. అయితే, కొందరు వీటి పేరుతో ఫేక్యాప్లు క్రియేట్చేసి దండుకుంటున్నారు. ఏఐ ఉపయోగించి డీప్‌ఫేక్ ఫొటోలు, వీడియోలు తయారు చేసి సోషల్‌మీడియాలో ఒరిజినల్యాప్లంటూ లింక్‌లు పంపిస్తున్నారు.
అలాగే ‘ఫ్రెండ్‌షిప్ క్లబ్,‘ప్రైవేట్ చాట్’‘లోకల్ కనెక్ట్’ యాప్‌లను పోలిన ఫేక్యాప్లు.. వాట్సాప్ ద్వారా లింక్‌లు పంపి చీట్చేస్తున్నాయి. డౌన్‌లోడ్ చేసుకున్నాక లాగిన్అయ్యేప్పుడు ఇచ్చే పర్సనల్ఇన్ఫర్మేషన్, బ్యాంక్ వివరాలు తీసుకుంటున్నారు. తర్వాత మొత్తం వ్యక్తిగత సమాచారం సేకరించి దర్జాగా ఏడాదికి రూ. కోట్లు కొల్లగొడుతున్నారు.
పోలీసులు ఏమంటున్నారంటే..
ఈ మధ్య డేటింగ్‌యాప్స్‌తో మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతోందని, అలాంటి వీడియోలను నమ్మకూడదంటున్నారు. వాటి ద్వారా వచ్చే లింక్‌లు, యాప్‌లను డౌన్‌లోడ్ చేయకూడదని హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోకూడదని సలహా ఇస్తున్నారు. అనుమానం వస్తే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. సైబర్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
యువతే లక్ష్యంగా..
డేటింగ్ యాప్ మోసాల్లో 18 నుంచి 35 ఏండ్ల మధ్య వయస్సున్న యువతే ఎక్కువగా మోసాల భారిన పడుతున్నారు. వీరు ప్రేమ, రిలేషన్‌షిప్ కోసం ఎదురుచూడడం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఫోన్లు ఎక్కువగా వాడతారు. కాబట్టి ఈ వయస్సుల వారినే టార్గెట్చేసుకుంటున్నారు. మోసపోయిన తర్వాత ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని బయటపడడం లేదు.
