ప్రేమకు అడ్డు వస్తోందని.. ప్రియుడితో కలసి తల్లిని చంపిన యువతి

V6 Velugu Posted on Oct 18, 2021

రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ మెట్ లో దారుణం చోటు చేసుకుంది. తమ ప్రేమకు కన్నతల్లి అడ్డు వస్తోందని ఓ యువతి  ప్రియుడితో కలిసి ఘాతుకానికి పాల్పడింది. కన్నతల్లి అని కనికరం చూపకుండా గొంతు నులిమి చంపేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.  
 చింతల్ మెట్ లో నివసిస్తున్న నందిని చోటూ అనే యువకుడితో ప్రేమలో ఉంది. కూతురు వ్యవహారం నచ్చకపోవడంతో తల్లి యాదమ్మ కుమార్తె నందినిని ప్రశ్నించింది. దీంతో తన ప్రేమకు అడ్డొస్తోందని భావించిన  నందిని తన ప్రియుడు చోటూతో కలసి తల్లిని అడ్డు తొలగించుకునేందుకు పథకం వేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల్లి యాదమ్మ గొంతు నులిమి చంపేశారు నందిని, ఆమె ప్రియుడు చోటూ. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 

Tagged Hyderabad, rangareddy, rajendranagar, chinthalmet, daughter killed mother, daughter Nandini, mother Yadamma, boy friend chotu, resiting love

Latest Videos

Subscribe Now

More News