డీఏవీ పబ్లిక్ స్కూల్ అనుమతి రద్దు చేయాలి : మహిళా, విద్యార్థి సంఘాలు

డీఏవీ పబ్లిక్ స్కూల్ అనుమతి రద్దు చేయాలి : మహిళా, విద్యార్థి సంఘాలు

హైదరాబాద్ లోని డైరెక్టర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వద్ద విద్యార్థి, మహిళా సంఘాల ఆందోళన చేపట్టాయి. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న అమ్మాయిలు, మహిళలపై అఘాయిత్యాలు ఆపాలని డిమాండ్ చేశారు. ఇటీవల డీఏవీ పబ్లిక్ స్కూల్ చిన్నారిపై జరిగిన ఘటనలో యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. వేలకు వేలు డొనేషన్లు తీసుకుంటున్నా... చిన్నారులకు రక్షణ లేదని మండిపడ్డారు. డీఏవీ స్కూల్ డ్రైవర్ ని తమకు అప్పగిస్తే తగిన బుద్ధి చెబుతాం మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొర్న సైట్లపైనా యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. 

హైదరాబాద్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా మహిళ సాంస్కృతిక సంఘంతో పాటు పలు విద్యార్థి సంఘాలు ( AIMSS, AIDSO, AIDYO ) డిమాండ్ చేశాయి. నాలుగేళ్ళ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని సభ్యులు కోరారు. ఈ ఘటనకు నిరసనగా పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కార్యాలయం ముందు మహిళా, విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టారు. డీఏవీ పాఠశాల ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, పాఠశాల అనుమతి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలలపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం దారుణమని ఆరోపించారు. బాలికలకు, మహిళలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలన్న మహిళా సంఘాలు.. రాష్ట్రంలో మద్యం, డ్రగ్స్, ఫోర్నోగ్రఫీ , బ్యాన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. సినిమాలలో అశ్లీలత, రియాలిటీ షో లను అరికట్టాలని, షీ టీమ్స్, భేటి బచావో, భేటి పడావో కార్యక్రమాలు కాదు.. ప్రభుత్వాలు వారి రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు.