మలన్ సెంచరీ.. ఇంగ్లండ్ విక్టరీ

మలన్ సెంచరీ.. ఇంగ్లండ్ విక్టరీ

ధర్మశాల: తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో ఎదురైన షాక్ నుంచి డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ కోలుకుంది. డేవిడ్ మలన్ (107 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 16 ఫోర్లు, 5 సిక్సర్లతో 140) భారీ సెంచరీకి తోడు జో రూట్ (68 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 82) దంచికొట్టడంతో మంగళవారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 137  రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాతో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఘన విజయం సాధించింది. టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓడిన ఇంగ్లండ్ తొలుత 50 ఓవర్లలో 364/9 స్కోరు చేసింది. 

ఓపెనర్  బెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టో (52)తో తొలి వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 115 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడించిన మలన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 151 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో భారీ స్కోరుకు బాటలు వేశాడు. ఈ ముగ్గురూ ఔటైన తర్వాత  మిగతా బ్యాటర్లు పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్యూ కట్టినా ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. బంగ్లా బౌలర్లలో మెహిదీ హసన్ 4, షోరిఫుల్ ఇస్లాం 3 వికెట్లు తీశారు. అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బంగ్లా  48.2 ఓవర్లలో 227 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. ఓపెనర్ లిటన్ దాస్ (76), ముష్ఫికర్ రహీమ్ (51), తౌహిద్ హృదయ్ (39) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు.

 ఇంగ్లిష్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలర్లలో  రీస్ టాప్లీ నాలుగు వికెట్లు పడగొట్టాడు. మలన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.