ఇక డే అండ్​ నైట్ డ్రంకెన్​ డ్రైవ్ టెస్టులు

ఇక డే అండ్​ నైట్ డ్రంకెన్​ డ్రైవ్ టెస్టులు

హైదరాబాద్‌, వెలుగు:సిటీలో ఇక నుంచి డే అండ్​నైట్ డ్రంకెన్​డ్రైవ్​టెస్టులు జరుగుతాయి. సిగ్నల్స్​దగ్గర మందుబాబులను పట్టుకునేందుకు ట్రాఫిక్​పోలీసులు కొత్త యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. రెడ్​సిగ్నల్​పడగానే వాహనదారుల వద్దకు వెళ్లి బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేస్తున్నారు. ట్రాఫిక్ మూవ్‌మెంట్‌, సిగ్నల్‌ టైంకి అనుగుణంగా స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం మెయిన్ జంక్షన్ల వద్ద ర్యాండమ్​గా చెక్​చేస్తుండగా బీఏసీ(బ్లడ్‌ ఆల్కహాల్ కంటెంట్) లెవెల్‌30 ఎంఎల్‌ దాటితే  కేసులు ఫైల్ చేస్తున్నారు. అలాగే డ్రంకెన్​డ్రైవ్​కేసులు ఎక్కువగా నమోదయ్యే రూట్లపైనా ఫోకస్ పెట్టారు. సుల్తాన్​బజార్​ట్రాఫిక్​ఇన్​స్పెక్టర్​సుమన్​కుమార్​ఆధ్వర్యంలో మంగళవారం జాంబాగ్​లో నిర్వహించిన డ్రైవ్​లో ఐదుగురు పట్టుబడ్డారు. 

బ్రీత్ ఎనలైజర్స్​తో పాయింట్‌ డ్యూటీ

ఈ మధ్య డే టైంలో మద్యం మత్తులో యాక్సిడెంట్లు చేసిన ఘటనలు కొన్ని జరిగాయి. నార్సింగి పీఎస్​పరిధిలో మద్యం మత్తులో ఓ క్వాలిస్​ డ్రైవర్ టూ వీలర్​పై వెళ్తున్న జంటను ఢీకొట్టగా ఇద్దరూ చనిపోయారు. మరి కొన్నిచోట్ల ఫుల్లుగా తాగి ప్రమాదానికి గురయ్యారు. దీంతో నైట్ టైంలోనే కాకుండా పగలు కూడా డీడీ(డ్రంకెన్​డ్రైవ్)టెస్టులు నిర్వహించాలని పోలీసులు డిసైడ్​అయ్యారు. సిగ్నళ్ల దగ్గర టెస్టులు చేస్తే ట్రాఫిక్​కు ఇబ్బంది ఉండదని నిర్ణయించారు. దీంతో ఇక నుంచి సిగ్నల్స్​వద్ద పాయింట్‌ డ్యూటీలో ఉండే ట్రాఫిక్​ఎస్సై, కానిస్టేబుల్స్‌ బ్రీత్​ఎనలైజర్​తో రెడీగా ఉంటారు. రెడ్​సిగ్నల్​పడగానే వాహనాదారుల వద్దకు వెళ్లి టెస్ట్​చేస్తారు. 

సిటీలో 18 హాట్​స్పాట్లు

లిక్కర్​మత్తులో వెహికల్స్​డ్రైవ్​చేస్తూ తరచూ పట్టుబడుతున్న కొన్ని ఏరియాలను పోలీసులు గుర్తించారు. వీటిని హాట్​స్పాట్లగా ట్రీట్ చేస్తున్నారు. సిగ్నల్స్ తోపాటు గుర్తించిన హాట్​స్పాట్స్​లో ర్యాండమ్​చెకింగ్స్​చేస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో డ్రంకెన్​డ్రైవ్​కేసులు ఎక్కువగా ఫైల్ అవుతున్న 18 హాట్​స్పాట్లు ఉన్నాయి. ​ప్రస్తుతం ప్రతి ట్రాఫిక్ పీఎస్‌ పరిధిలో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 4.30 గంటల వరకు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. రాత్రి 11 నుంచి  తెల్లవారుజామున 4 గంటల వరకు ఎప్పటిలాగే డ్రంకెన్​డ్రైవ్​కొనసాగుతోంది. అలాగే పెండింగ్​డీడీ కేసులు క్లియర్ చేయాలని పోలీసులు నిర్ణయించారు. 2021 డిసెంబర్‌‌31కు ముందు రిజిస్టరైన కేసులను క్లోజ్ చేస్తున్నారు. జైలు శిక్షలు లేకుండానే ఫైన్స్‌ చెల్లించే ఏర్పాట్లు చేశారు. ఈ నెల19 నుంచి మొదటిసారి పట్టుబడ్డవారి  కేసులను క్లోజ్ చేస్తున్నారు. కోర్టులో అటెండ్‌ అవుతున్న వారికి జడ్జిలు బ్లడ్‌ ఆల్కహాల్‌ కంటెంట్‌ లెవల్స్‌(బీఏసీ)ను బట్టి రూ.1,500 నుంచి రూ.5 వేల వరకు ఫైన్లు వేస్తున్నారు. రిపీటెడ్‌గా పట్టుబడ్డ వారి కేసులను మార్చి12న నిర్వహించే మెగా లోక్‌అదాలత్​ లోపు క్లోజ్ ​చేయాలని చూస్తున్నారు. అందుకోసం వాహనదారులకు ఫోన్స్ చేసి సమాచారం ఇస్తున్నారు.

యాక్సిడెంట్లు తగ్గించేందుకే..

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ర్యాండమ్ ​డ్రంకెన్ ​డ్రైవ్ నిర్వహిస్తున్నాం. గుర్తించిన హాట్​స్పాట్​ రూట్లలో బ్రీత్​అనలైజర్​తో టెస్టులు చేస్తున్నాం. ట్రాఫిక్​కు ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న డ్రంకెన్​డ్రైవ్‌ కేసులను క్లోజ్ చేస్తున్నాం. స్పెషల్‌ కోర్టుల ద్వారా ప్రతిరోజు 1,200 కేసులు క్లోజ్ చేస్తున్నాం. 
-  ఏవీ రంగనాథ్‌, జాయింట్ సీపీ, ట్రాఫిక్, హైదరాబాద్‌