జూబ్లీహిల్స్లో డీసీఏ దాడులు.. మెడిసిన్స్ సీజ్

జూబ్లీహిల్స్లో  డీసీఏ దాడులు.. మెడిసిన్స్  సీజ్

 హైదరాబాద్ లో  మెడికల్ షాపులపై  తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. ఈ క్రమంలో   జూబ్లీహిల్స్, ముషీరాబాద్ ప్రాంతాల్లోని పలు మెడికల్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ముషీరాబాద్ లో మెడికల్ షాపులో తనిఖీ చేసి అధిక ధర కలిగిన యాంటీ ఫంగల్ మెడిసిన్ బి-సిమ్ ఆయింట్‌మెంట్, ముపిరోసిన్ ఆయింట్‌మెంట్ IP 2% సీజ్ చేశారు.  

జూబ్లీహిల్స్‌ మెడికల్ షాపుల్లో తప్పుడు ప్రకటనలు చేస్తూ అమ్ముతున్న మెడిసిన్ ను సీజ్ చేశారు అధికారులు.  స్థూలకాయం, పక్షవాతం, అల్సర్ కు చికిత్స చేస్తుందని అమ్ముతున్న జామూన్ వెనిగర్ అనే యునాని మెడిసిన్ ను  సీజ్ చేశారు. అధిక రేటుకు మెడిసిన్ అమ్మినా, తప్పుడు ప్రకటనలు చేస్తూ నిషేధిత మెడిసిన్ అమ్మిన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు