ప్రభుత్వ పథకాలే మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తయ్ : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

ప్రభుత్వ పథకాలే మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తయ్ : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
  • డీసీసీ చీఫ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్ బీర్ల అయిలయ్య అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసి గడపగడపకు తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కోరారు.

యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి కోసం ప్రజల షాపులు, ఇండ్లు, భూములు గుంజుకుని రోడ్డున పడేసిన బీఆర్ఎస్ కు మున్సిపల్ ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, సైదాపురం ఉప సర్పంచ్ దుంబాల వెంకట్ రెడ్డి, టౌన్ అధ్యక్షుడు బిక్షపతి, కాంగ్రెస్ అభ్యర్థులు కాటబత్తిని స్వప్న ఆంజనేయులు, అరుణ, మధు, మల్లేష్ యాదవ్, సరోజ హరీష్ తదితరులు ఉన్నారు.