ఈశాన్య రాష్ట్రాల్లో డీసీసీ చీఫ్ల నియామకం.. అబ్జర్వర్లుగా హర్కర, బెల్లయ్య నాయక్

ఈశాన్య రాష్ట్రాల్లో డీసీసీ చీఫ్ల నియామకం.. అబ్జర్వర్లుగా హర్కర, బెల్లయ్య నాయక్
  •     ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి  కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు 

హైదరాబాద్, వెలుగు: ఈశాన్య రాష్ట్రాల్లో జరగనున్న డీసీసీ చీఫ్​ ల నియామకం కోసం ఎలక్షన్ అబ్జర్వర్లుగా రాష్ట్రం నుంచి ఇద్దరు నేతలను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. మణిపూర్​కు ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్​ను, మేఘాలయాకు తెలంగాణ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్​ను అపాయింట్ చేసింది. 

ఈ మేరకు శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఇద్దరు నేతలు ఆయా రాష్ట్రాల్లోని డీసీసీ అధ్యక్షుల నియామకంపై అక్కడి నాయకుల అభిప్రాయాలను తెలుసుకొని హైకమాండ్ కు ఒక నివేదిక అందించనున్నారు.