గెలిచిన సర్పంచులు పార్టీలకతీతంగా అభివృద్ధి చేయాలి : పున్నా కైలాష్

గెలిచిన సర్పంచులు పార్టీలకతీతంగా అభివృద్ధి చేయాలి : పున్నా కైలాష్
  • డీసీసీ జిల్లా అద్యక్షుడు పున్నా కైలాష్ నేత  

నల్గొండ, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేయాలని డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాశ్ నేత అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని డీసీసీ జిల్లా అధ్యక్షుడు పున్నా కైలాశ్ నేత అన్నారు. 

గ్రామాల్లో గెలిచిన సర్పంచులు పార్టీలకు అతీతంగా అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్  గెలిచింది కేవలం 23 శాతం మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ 70 శాతం సర్పంచ్ స్థానాలు గెలిచామని స్పష్టం చేశారు. 

జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై క్లాక్ టవర్ సెంటర్‌‌‌‌లో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డిని తిడితే ఊరుకోమని హెచ్చరించారు. మిర్యాలగూడ దేవరకొండ డివిజన్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జిల్లా ఎస్సీ సెల్ అద్యక్షుడు బోడ స్వామి, ప్రవీణ్, వెంకన్న గౌడ్, దుబ్బా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.