చెన్నూరు, వెలుగు: కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను డీడీసీ ప్రెసిడెంట్రఘునాథ్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. చెన్నూరులోని ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనుల పేర్లు మార్చి తానే చేస్తున్నానని మంత్రి చెప్పుకుంటున్నారని సుమన్అనడం విడ్డూరంగా ఉందన్నారు.
గొప్పలు చెప్పుకుంటున్న బాల్క సుమన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి వివేక్ అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. చెన్నూరు మండలంలోని సోమనపల్లిలో రూ.250 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, పట్టణంలో సుమారు రూ.100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. సుమన్ చెన్నూరు ప్రజలను మోసం చేస్తూ, మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్ తివారీ, కాంగ్రెస్పట్టణ అధ్యక్షుడు చెన్న సూర్యనారాయణ, నేతలు గొడిసెల బాపిరెడ్డి, రాజమల్ల గౌడ్, సత్యనారాయణ రెడ్డి, ఫయాజ్, చెన్నూరు, కోటపెల్లి, భీమారం, జైపూర్ మండలాల సర్పం చులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
