జూరాల ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద..

జూరాల ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద..

2 గేట్ల ద్వారా కొనసాగుతున్ననీటి విడుదల

మహబూబ్ నగర్: కృష్ణా నదిలో వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహానికి అనుగుణంగా గేట్లు ఎత్తుతూ.. దించుతూ వస్తున్నారు. ప్రస్తుతం కేవలం రెండు గేట్ల ద్వారా మాత్రమే నీరు విడుదల చేస్తున్నారు. ఉదయం 6గంటల సమయంలో నమోదైన రికార్డుల ప్రకారం జూరాల ప్రాజెక్టు వద్ద ఇన్ ఫ్లో 51,602 క్యూసెక్కులు వస్తోంది. డ్యామ్ ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండి ఉండడంతో వస్తున్న వరదను వస్తున్నట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. కాలువలతోపాటు గేట్ల ద్వారా మొత్తం  50,421 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా..  9.377 టీఎంసీలు నిల్వ ఉంచుతున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 318.380 మీటర్ల నీటిమట్టం ఉంది. రెండు  జల విద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.