
టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు కార్ల ర్యాలీ చేపట్టారు. అయితే ఈ ర్యాలీకి ఎటువంటి పర్మిషన్ లేదని ఏపీ పోలీసులు తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని వెల్లడించారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ క్రమంలో తెలంగాణ- ఏపీ సరిహద్దులో గరికపాడు సహా ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై చెక్ పోస్ట్ వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి చెక్ పోస్టుల దగ్గర వాహనాలు తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు.