కోహ్లీ గురించి తప్పుడు సమాచారం ఇచ్చా : డివిలియర్స్‌‌

కోహ్లీ గురించి తప్పుడు సమాచారం ఇచ్చా : డివిలియర్స్‌‌

జొహనెస్‌‌‌‌‌‌‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌: టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారని తాను చేసిన వ్యాఖ్యలపై సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ ఏబీ డివిలియర్స్‌‌‌‌‌‌‌‌ యూ టర్న్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నాడు. తప్పుడు సమాచారం ఇవ్వడం  ద్వారా తాను చాలా పెద్ద మిస్టేక్‌‌‌‌‌‌‌‌ చేశానని తెలిపాడు.  అసలు ఇండియాలో ఏం జరుగుతుందో కూడా తనకు తెలియదన్నాడు.

‘కొన్నిసార్లు ఫ్యామిలీకి తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని నా గత యూట్యూబ్‌‌‌‌‌‌‌‌ చానెల్‌‌‌‌‌‌‌‌ వీడియోలో చెప్పా. అదే టైమ్‌‌‌‌‌‌‌‌లో ఓ పెద్ద మిస్టేక్‌‌‌‌‌‌‌‌ కూడా చేశా. కోహ్లీకి సంబంధించిన తప్పుడు సమాచారాన్ని షేర్‌‌‌‌‌‌‌‌ చేశా. నేను చెప్పిన దానిలో ఎలాంటి నిజం లేదు. విరాట్‌‌‌‌‌‌‌‌ విషయంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. కోహ్లీ బ్రేక్‌‌‌‌‌‌‌‌కు కారణమేదైనా తను మరింత బలంగా, మెరుగ్గా తిరిగి వస్తాడని ఆశిస్తున్నా’ అని డివిలియర్స్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు.