సికింద్రాబాద్ మారేడుపల్లిలో ఆడి కారులో డెడ్ బాడీ కలకలం సృష్టించింది. కరెంట్ షాక్ తో చనిపోయిన యువకుడిని గుట్టు చప్పుడు కాకుండా ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగానే.. కారులోని డెడ్ బాడీని అంబులెన్స్ లోకి తరలించి పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసుల వెంటనే వారిని పోలీసులు అడ్డుకున్నారు.
అసలేం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్ గోరఖ్ పుర్ కు చెందిన ఓ మైనర్ బాలుడు వినయ్ స్థానికంగా నివాసం ఉంటూ...మారేడుపల్లి సర్వసుఖీ కాలనీలో ఓ బిల్డింగ్ లో కార్పెంటర్ పనులు చెస్తున్నాడు..అయితే అక్టోబర్ 21న సాయంత్రం పనులు చెస్తుండగా..ఓక్క సారిగా కరెంట్ షాక్ కోట్టడంతో కింద పడిపోయడు. వెంటనే గమనించిన యజమాని అతడిని తన ఆడి కారులో మారేడుపల్లి లోని గీత నర్సింగ్ హోంకు తరలించాడు. అయితే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు దృవీకరించారు.
పోలీస్టేషన్ లో ఫిర్యాదు చెస్తే గోడవ అవుతుందని వెంటనే మృత దేహన్ని కారులో తరలించే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో డెడ్ బాడీని అంబులెన్స్ ను పిలిపించి నేరుగా ఉత్తర్ ప్రదేశ్ తీసుకెళ్లాని సూచించాడు. అప్పటికే సమాచారం అందుకున్న మారేడుపల్లి పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా మృతదేహన్ని తరలించే ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మృతదేహన్ని గాంధీ మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.