- ఈ నెల16 వరకు అవకాశం: సైదులు
హైదరాబాద్, వెలుగు: బీసీ గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ అడ్మిషన్లకు అప్లై చేసుకునేందుకు గడువును ఈనెల 16 వరకు పొడిగించినట్లు ఎంజేపీ సెక్రటరీ సైదులు వెల్లడించారు. వచ్చే అకడమిక్ ఇయర్ కు ఆన్ లైన్ లో అప్లై చేసుకునేందుకు గడువు పెంచాలని తల్లిదండ్రుల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
అధికారిక వెబ్‌సైట్ https://mjptbcwreis.telangana.gov.in, https://mjptbcadmissions.org/MJP-Inter వెబ్ సైట్ల ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. కోర్సులకు, కాలేజీలకు సంబంధించిన అన్ని వివరాలు వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవాలన్నారు. డిగ్రీ అడ్మిషన్లకు mjptbcwreis.telangana.gov.in లేదా https://mjptbcadmissions.org/MJP-Degree/ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకుని స్టూడెంట్లు కోరుకున్న కోర్సులో సీటు కేటాయిస్తామని సైదులు వెల్లడించారు. ఈ ఏడాది ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
