ఉత్తర ఆఫ్రికా దేశమైన అల్జీరియాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది.బౌయిరాలో చెలరేగుతున్న కార్చిచ్చులో 25 మంది మరణించారు. వీరిలో 10 మంది సైనికులు కూడా ఉన్నారు. వీరు అధిక గాలులు మరియు వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు తెలిపాయి. మరో 25 మంది గాయపడ్డారు.
7,500 మంది అగ్నిమాపక సిబ్బంది..
అల్జీర్స్‌కు ఆగ్నేయంగా 100 కిలోమీటర్లు (60 మైళ్లు) దూరంలో ఉన్న బౌయిరాలో పెద్ద స్దాయిలో మంటలు చెలరేగాయని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. మంటలను అదుపుచేసేందుకు చేపట్టిన ఆపరేషన్లలో దాదాపు 7,500 మంది అగ్నిమాపక సిబ్బంది మరియు 350 ట్రక్కులు పాల్గొన్నాయి. అల్జీరియా వేసవిలో కార్చిచ్చు సాదారణంగా జరుగుతుంటుంది. ట్యునీషియాతో అల్జీరియా ఉత్తర సరిహద్దు సమీపంలో గత ఆగస్టులో మంటలు చెలరేగడంతో కనీసం 37 మంది మరణించారు.
మంటలను అదుపు చేసే క్రమంలో సైనికులు మృత్యువాత పడుతున్నారు. కార్చిచ్చు వల్ల కొంగలు గ్రీస్ దాటి పోతున్నాయి. ఈ మంటల వల్ల పశువులు, కోళ్లు మరణించాయి. కార్చిచ్చు వెనుక ఎవరి హస్తం అయినా ఉండవచ్చని అల్జీరియా మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. పౌరులను రక్షించేందుకు, కార్చిచ్చు ఆపేందుకు అల్జీరియా ప్రభుత్వం సైన్యాన్ని పంపింది. చాలా ప్రాంతాల్లో అడవుల్లో మంటలు వ్యాపించగా.. ఘటన జరిగిన ప్రాంతంలోని కుటుంబాల జీవనోపాధిని అందించే ఆలివ్ చెట్లు కాలిపోగా.. పశువులు మృత్యువాతపడ్డాయి. బాధితులకు పరిహారం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కాగా.. అగ్నిమాపక సిబ్బంది, సైన్యం మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. సోమవారం ( జులై 24)రాత్రి నుంచి 13 ప్రావిన్స్‌ల్లో మంటలు చేలరేగగా అడవులు కాలిబూడిదవుతున్నాయి.
