ఎల్గర్‌‌‌‌ జోరు..సెంచరీతో చెలరేగిన డీన్‌‌‌‌

ఎల్గర్‌‌‌‌ జోరు..సెంచరీతో చెలరేగిన డీన్‌‌‌‌

సెంచూరియన్‌‌‌‌ : ఇండియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌‌‌‌లో సౌతాఫ్రికా పట్టు బిగిస్తోంది. డీన్‌‌‌‌ ఎల్గర్‌‌‌‌ (211 బాల్స్‌‌‌‌లో 23 ఫోర్లతో 140 బ్యాటింగ్‌‌‌‌) సెంచరీతో చెలరేగడంతో.. బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ప్రొటీస్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 66 ఓవర్లలో 256/5 స్కోరు చేసింది. ఎల్గర్‌‌‌‌తో పాటు మార్కో జెన్సెన్‌‌‌‌ (3 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నాడు. బెడింగ్‌‌‌‌హమ్‌‌‌‌ (56) హాఫ్‌‌‌‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరు 208/8తో ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 67.4 ఓవర్లలో 245 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ (137 బాల్స్‌‌‌‌లో 14 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌లతో 101) వీరోచిత సెంచరీతో ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. సూపర్‌‌‌‌స్పోర్ట్‌‌‌‌ పార్క్‌‌‌‌లో రెండు టెస్ట్‌‌‌‌ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌‌‌‌గా రికార్డులకెక్కాడు. తొలి సెషన్‌‌‌‌లో కేవలం 9 ఓవర్లు మాత్రమే ఆడిన రాహుల్‌‌‌‌.. రబాడ (5/59), కోయెట్జీ (7/74) బౌలింగ్‌‌‌‌లో రెండు సిక్స్‌‌‌‌లు కొట్టి కెరీర్‌‌‌‌లో 8వ సెంచరీని అందుకున్నాడు. సిరాజ్‌‌‌‌ (5)తో 9వ వికెట్‌‌‌‌కు 47 రన్స్‌‌‌‌ జోడించి ఔటయ్యాడు. ప్రస్తుతం సఫారీ టీమ్‌‌‌‌ 11 రన్స్‌‌‌‌ ఆధిక్యంలో కొనసాగుతున్నది. 

తేలిపోయిన బౌలర్లు..

తొలి సెషన్‌‌‌‌లో సౌతాఫ్రికాను ఇబ్బంది పెట్టిన ఇండియా బౌలర్లు తర్వాత తేలిపోయారు. ఎల్గర్‌‌‌‌ సూపర్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌కు అడ్డుకట్ట వేయలేకపోయారు. నాలుగో ఓవర్‌‌‌‌లో మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ (5)ను ఔట్‌‌‌‌ చేసి సిరాజ్‌‌‌‌ (2/63) శుభారంభాన్నిచ్చినా.. మిగతా బౌలర్లు దాన్ని అందుకోలేకపోయారు. 11/1 స్కోరుతో కష్టాల్లో పడిన ప్రొటీస్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ను ఎల్గర్‌‌‌‌ అద్భుతంగా నిర్మించాడు. తన కెరీర్‌‌‌‌కు ఇదే చివరి సిరీస్‌‌‌‌ కావడంతో ఆచితూచి ఆడుతూ శార్దూల్‌‌‌‌ (0/57), ప్రసిధ్‌‌‌‌ కృష్ణ (1/61) బౌలింగ్‌‌‌‌లో భారీగా రన్స్‌‌‌‌ రాబట్టాడు. రెండో ఎండ్‌‌‌‌లో టోనీ డి జోర్జి (28) కూడా వికెట్‌‌‌‌ను కాపాడుకోవడంతో లంచ్‌‌‌‌ వరకు ప్రొటీస్‌‌‌‌ 49/1 స్కోరు చేసింది. ఇక రెండో సెషన్‌‌‌‌లోనూ ఎల్గర్‌‌‌‌ ఆధిపత్యమే నడిచినా, మధ్యలో బుమ్రా (2/48) డబుల్‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌ ఇచ్చాడు. ఇన్నింగ్స్‌‌‌‌ 29, 31 ఓవర్లలో వరుసగా జోర్జి, కీగన్‌‌‌‌ పీటర్సన్‌‌‌‌ (2)ను ఔట్‌‌‌‌ చేశాడు. దీంతో ఎల్గర్‌‌‌‌, జోర్జి మధ్య రెండో వికెట్‌‌‌‌కు 93 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. తొలి వంద రన్స్‌‌‌‌లో 18 ఫోర్లు కొట్టడం ఇండియా బౌలింగ్‌‌‌‌ బలహీనతకు నిదర్శనం. వరుస విరామాల్లో రెండు వికెట్లు పడినా ఎల్గర్‌‌‌‌ ఆటలో ఎలాంటి మార్పు రాలేదు. రెండో ఎండ్‌‌‌‌లో బెడింగ్‌‌‌‌హమ్‌‌‌‌ కూడా మంచి సహకారం అందించాడు. స్పిన్నర్‌‌‌‌ అశ్విన్‌‌‌‌ (0/19) రన్స్‌‌‌‌ కాపాడినా వికెట్లు తీయలేకపోయాడు. ఈ క్రమంలో ఎల్గర్‌‌‌‌ 140 బాల్స్‌‌‌‌లో సెంచరీ పూర్తి చేయగా, సౌతాఫ్రికా 194/3 స్కోరుతో టీ విరామానికి వెళ్లింది. మూడో సెషన్‌‌‌‌లో బెడింగ్‌‌‌‌హమ్‌‌‌‌ జోరు నడిచింది. పేసర్ల బౌలింగ్‌‌‌‌లో రెండు భారీ సిక్సర్లతో 80 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సెషన్‌‌‌‌లో దాదాపు 11 ఓవర్ల పాటు క్రీజులో ఉన్న బెడింగ్‌‌‌‌హమ్‌‌‌‌ను 61వ ఓవర్‌‌‌‌లో సిరాజ్‌‌‌‌ ఓ షార్ట్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌ బాల్‌‌‌‌తో దెబ్బకొట్టాడు. దీంతో నాలుగో వికెట్‌‌‌‌కు 131 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. తర్వాతి ఓవర్‌‌‌‌లో కైల్‌‌‌‌ వెరియానె (4)ను ప్రసిధ్‌‌‌‌ బోల్తా కొట్టించాడు. ఈ దశలో బ్యాడ్‌‌‌‌ లైట్‌‌‌‌ కారణంగా ఆటను ఆపేశారు. 

సంక్షిప్త స్కోర్లు

ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌ : 67.4 ఓవర్లలో 245 ఆలౌట్‌‌‌‌ (రాహుల్‌‌‌‌ 101, సిరాజ్‌‌‌‌ 5, రబాడ 5/59, బర్గర్‌‌‌‌ 3/50). సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌‌‌‌: 66 ఓవర్లలో 256/5 (ఎల్గర్‌‌‌‌ 140*, బెడింగ్‌‌‌‌హమ్‌‌‌‌ 56, బుమ్రా 2/48, సిరాజ్‌‌‌‌ 2/63).