హైదరాబాద్ : లోన్ యాప్ లపై విచారించింది హైకోర్టు. లోన్ యాప్ లను బ్లాక్ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. న్యాయవాది కళ్యాణ్ దీప్ పిల్ పై సీజే ధర్మాసనం విచారించింది. యాప్ వేధింపులపై నివేదికను సమర్పించాలని డీజీపీకి ఆదేశించిన కోర్టు.. యాప్ లను తొలగించేందుకు వెంటనే ప్లే స్టోర్ లను సంప్రదించాలని సూచించింది. యాప్ ల నిర్వాహకులను కట్టడి చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలంది. తదుపరి విచారణను మార్చి 18కి వాయిదా వేసింది ధర్మాసనం.
