డెట్ మ్యూచువల్ ఫండ్స్కు పెరుగుతున్న ఆదరణ

డెట్ మ్యూచువల్ ఫండ్స్కు పెరుగుతున్న ఆదరణ
  • గత నెల రూ. 1.6 లక్షల కోట్లు పెట్టుబడులు 


న్యూఢిల్లీ: డెట్​ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌‌లోకి గత నెల రూ. 1.6 లక్షల కోట్ల నికర నిధులు వచ్చాయి. అంతకు ముందు సెప్టెంబర్‌‌లో రూ. 1.02 లక్షల కోట్లు నికర ఔట్‌‌ఫ్లోస్​ ఉన్నాయి. ఈ విషయాన్ని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్​ఐ) వెల్లడించింది.  గతంలో లిక్విడిటీ సమస్యలు ఉన్న కారణంగా నిధులు వెనక్కి తీసుకున్న ఇన్వెస్టర్లు, ఇప్పుడు మళ్లీ మార్కెట్‌‌లోకి ప్రవేశించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. స్వల్పకాలిక కేటగిరీల్లో ఎక్కువ నిధులు వచ్చాయి. లిక్విడ్ ఫండ్స్‌‌ రూ. 89,375 కోట్ల నికర ఇన్​ఫ్లోస్​తో పుంజుకున్నాయి. ఓవర్​నైట్ ఫండ్స్‌‌లోకి రూ. 24,051 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్‌‌లోకి రూ. 17,916 కోట్లు అదనంగా వచ్చాయి.  డైనమిక్ బాండ్ ఫండ్స్‌‌లోకి రెండు నెలల ఇన్​ఫ్లోస్​ తర్వాత రూ. 232 కోట్ల ఔట్​ఫ్లో నమోదైంది. క్రెడిట్ రిస్క్ ఫండ్స్​లో అంతకుముందు నెలతో పోలిస్తే రూ. 84 కోట్ల ఔట్​ఫ్లో ఉంది. కార్పొరేట్ బాండ్ ఫండ్స్​లోకి రూ. 5,122 కోట్లు వచ్చాయి.  

ఐటీఐ మ్యూచువల్​ ఫండ్​ నుంచి ఎస్​ఐఎఫ్​

ఐటీఐ అసెట్ మేనేజ్‌‌మెంట్ లిమిటెడ్​ తన స్పెషలైజ్డ్​ ఇన్వెస్ట్‌‌మెంట్ ఫండ్​ (ఎస్​ఐఎఫ్​) ప్లాట్‌‌ఫారమ్​ను ప్రారంభించింది. దీని కింద మొదటి ఆఫరింగ్‌‌గా 'దివినిటి ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్'ను తీసుకొచ్చింది. ఈ ఫండ్​ మార్కెట్​ సైకిల్స్​లో వృద్ధిని సాధించడం, నష్టాలను పరిమితం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఓపెన్-ఎండెడ్ స్ట్రాటజీ. లిస్టెడ్ ఈక్విటీలు, డెరివేటివ్‌‌ల ద్వారా లిమిటెడ్​ షార్ట్​ పొజిషన్స్‌‌లో పెట్టుబడి పెడుతుంది. ఎన్​ఎఫ్​ఐ సోమవారం మొదలవగా, ఈ నెల 24న ముగుస్తుంది. ఈ ఫండ్‌‌లో క్వాలిఫైడ్​ ఇన్వెస్టర్లకు కనీస పెట్టుబడిని రూ. 10 లక్షలుగా నిర్ణయించారు. 

ఐపీఓలలో భారీగా ఎంఎఫ్​ల పెట్టుబడి

ఈ ఏడాది సెప్టెంబర్​తో ముగిసిన క్వార్టర్​లో మ్యూచువల్ ఫండ్‌‌లు ఐపీఓలలో రూ. 8,752 కోట్ల పెట్టుబడులు పెట్టాయని స్టాక్ బ్రోకింగ్ ప్లాట్‌‌ఫారమ్​ వెంచురా వెల్లడించింది. ఈ కొత్త లిస్టింగ్స్‌‌లో అధిక భాగం స్మాల్‌‌ క్యాప్ కేటగిరీలో ఉన్నాయి, మిడ్ క్యాప్ విభాగంలో కేవలం ఒకటే ఉంది. దీన్ని బట్టి మ్యూచువల్ ఫండ్స్​ దీర్ఘకాలంలో అధిక రాబడిని అందించే సామర్థ్యం ఉన్న చిన్న వ్యాపారాలపై వ్యూహాత్మకంగా పెట్టుబడి పెడుతున్నాయని తెలుస్తోంది. ఈ క్వార్టర్​లో   9 మిడ్ క్యాప్‌‌లు లార్జ్ క్యాప్‌‌లుగా మారే అవకాశం ఉందని, 6 స్మాల్ క్యాప్‌‌లు మిడ్ క్యాప్‌‌లుగా మారే అవకాశం ఉందని మ్యూచువల్ ఫండ్స్​భావిస్తున్నాయని వెంచురా తెలిపింది.