న్యూయార్క్‌‌‌‌లో నాన్ సిటిజన్లకు ఓట్లు

న్యూయార్క్‌‌‌‌లో నాన్ సిటిజన్లకు ఓట్లు
  • కొత్త చట్టం తెచ్చిన సిటీ కౌన్సిల్

న్యూయార్క్‌‌: డ్రీమర్లకు, నాన్ సిటిజన్లకు ఓటు హక్కు కల్పిస్తూ న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తీసుకొచ్చిన బిల్లును సిటీ కౌన్సిల్ ఆమోదించగా.. ఆదివారం అది చట్టంగా మారింది. దీంతో వచ్చే ఏడాది జరగనున్న మున్సిపల్ ఎలక్షన్‌‌లో 8 లక్షల మందికి పైగా నాన్ సిటిజన్లు ఓటు వేయనున్నారు. కాగా, న్యూయార్క్ మాత్రమే కాకుండా అమెరికాలో ఇప్పటిదాకా డజనుకు పైగా కమ్యూనిటీలు నాన్ సిటిజన్లకు స్థానిక ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాయి. నాన్ సిటిజన్లకు ఓటు హక్కు కల్పించాలనే ఉద్యమం ఎప్పటి నుంచో నడుస్తోంది.

వీరికి అవకాశం..
కొత్త చట్టం ద్వారా.. కనీసం 30 రోజుల పాటు నగరంలో చట్టబద్ధంగా శాశ్వత నివాసితులుగా ఉన్న నాన్ సిటిజన్లు, అమెరికాలో పని చేసేందుకు అవకాశం పొందిన వాళ్లు, డ్రీమర్లు ఇకనుంచి నగర మేయర్, సిటీ కౌన్సిల్ సభ్యులు, బోరో ప్రెసిడెంట్లు, కంట్రోలర్, పబ్లిక్ అడ్వకేట్‌‌లను ఎన్నుకునేందుకు జరిగే ఓటింగ్‌‌లో పాల్గొనవచ్చు. దీంతో న్యూయార్క్‌‌లో ఉంటున్న మన వాళ్లకు కూడా ఓటు వేసేందుకు అవకాశం దక్కనుంది.