
Decreasing temperatures in Telangana, telangana weather, telangana weather update, hyderabad weather, latest news, telugu news. సిటీతో పాటు శివారు ప్రాంతాలు.. ఉత్తర తెలంగాణ జిల్లాలలో పొగమంచు, చల్లటి గాలులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ కార్మికులు, ఉదయం పనులకు వెళ్లేవారు, వాకింగ్ చేసేవారు చలి తీవ్రత పెరగడంతో స్వెట్టర్లు, మంకీ క్యాపులతో బయటకు వస్తున్నారు.
రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కండిషన్స్ వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగలు ఎండలు మండిపోతున్నాయి. ఉదయం రాత్రి వేళల్లో టెంపరేచర్స్ పడిపోతున్నాయి. ఉదయం 9 అయినా సూర్యుడు కనిపించడం లేదు. పొగమంచు రోడ్లను కమ్మేస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 5 తర్వాత చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 16 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. హైవేలు, రోడ్లపై పొగమంచు కమ్మేసింది. దీంతో ముందు వస్తున్న వాహనాలు కనపడని పరిస్థితి ఏర్పడింది. రోడ్లపై నడిచేవారు పొగమంచుతో ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 9గంటల వరకూ ఎండ రావడం లేదు. రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లలో గిరాకీ లేదంటున్నారు వ్యాపారులు.