హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) ఫస్టియర్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. డిసెంబర్ లో పరీక్షలు జరగ్గా.. మంగళవారం ఈ పరీక్షల ఫలితాలు రిలీజ్ చేసినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. రిజల్ట్స్ ను అధికారిక వెబ్సైట్ www.bse.telangana.gov.in లో అందుబాటులో ఉంచారు.
అభ్యర్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి వెబ్ మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చని డైరెక్టర్ సూచించారు. మార్కులపై అనుమానాలు ఉన్న అభ్యర్థులు ఈ నెల 23 వరకు రీకౌంటింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
