హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కంపెనీ దీపా జ్యువెలర్స్ ఐపీఓకి వచ్చేందుకు రెడీ అవుతోంది. సెబీ వద్ద డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) దాఖలు చేసింది. ఐపీఓలో రూ.250 కోట్ల వరకు ఫ్రెష్ ఇష్యూ, 1.18 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ఉంటాయి. రూ.215 కోట్ల ఫ్రెష్ ఇష్యూ నిధులు వర్కింగ్ క్యాపిటల్‌కు, ఇన్వెంటరీ పెంచుకోవడానికి, కార్పొరేట్ అవసరాలకు వాడతామని కంపెనీ పేర్కొంది.
2016లో ఏర్పాటైన దీపా జ్యువెలర్స్, బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) అవసరాలకు హాల్మా ర్క్ ఉన్న గోల్డ్ జ్యువెలరీని డిజైన్, ప్రాసెస్, సరఫరా చేస్తోంది. వడ్డాణం, సీఎన్సీ కట్ బ్యాంగిల్స్, వంకీ,జడా, గుండ్లమాల హారం వంటి ఉత్పత్తులు ప్రధానంగా అమ్ముతోంది. 13 రాష్ట్రాలు, 1 యూనియన్ టెరిటరీలో 315 కస్టమర్ల నెట్ వర్క్ కలిగి ఉంది.
