సోనిపట్: ఇండియా స్టార్ ఆర్చర్, మాజీ వరల్డ్ నంబర్ దీపిక కుమారి వరల్డ్ కప్స్, పారిస్ ఒలింపిక్స్ కోసం జరిగిన సెలెక్షన్ ట్రయల్స్‌లో టాప్ ప్లేస్ సాధించింది. ఈ మెగా టోర్నీల్లో ఆడే నలుగురితో కూడిన ఇండియా విమెన్స్ రికర్వ్ టీమ్‌కు ఎంపికైంది. ఈ టీమ్‌లో భజన్ కౌర్, అంకితా భకట్, కోమలికా బారి కూడా చోటు సాధించారు. మెన్స్ రికర్వ్‌లో ఏపీ కుర్రాడు బొమ్మదేవర ధీరజ్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు.
తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్, మ్రినాల్ చౌహన్ మెన్స్ టీమ్‌కు సెలెక్ట్ అయ్యారు. ఏప్రిల్ 21–28 తేదీల్లో షాంఘైలో వరల్డ్ కప్ స్టేజ్1, మే 21–26 తేదీల్లో సౌత్ కొరియాలోని యెచియోన్‌లో రెండో స్టేజ్ జరుగుతాయి.
