దీపిక..డ్రెస్సింగ్ సెన్స్

దీపిక..డ్రెస్సింగ్ సెన్స్

గత 8 రోజులుగా ఫ్రాన్స్ లోని కేన్స్ లో జరుగుతున్న  ఫిల్మ్ ఫెస్టివల్ లో హీరోయిన్ దీపికా పదుకొనె ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. తొలి రోజు నుంచి ఇప్పటివరకు భిన్న, విభిన్న డ్రెస్సుల్లో ఆమె అదరగొట్టారు. సూపర్బ్ డ్రెస్సింగ్ సెన్స్ తో అందరి మన్ననలు అందుకున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో దీపిక ఫొటోలు వైరల్ అవుతున్నాయి. గత 8 రోజుల్లో బ్యూటిఫుల్ డ్రెస్సుల్లో ఆమె తళుక్కుమన్న కొన్ని ఫొటోలపై ఇప్పుడొక లుక్ వేద్దాం. 

  • ఇది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మొదటిరోజున దీపిక ధరించిన డ్రెస్. ఈ డ్రెస్సులోనే ఆమె ఎర్రతివాచీ మీదుగా నడుచుకుంటూ న్యాయ నిర్ణేత సీటు దాకా వెళ్లారు. గోల్డెన్ బ్లాక్ రంగులోని ఈ చీర దీపిక అందాన్ని మరింత ఇనుమడింపజేసింది. చీరపై ఉన్న నలుపురంగు చారలకు అనుగుణంగా కనుబొమ్మలను ఆమె మేకప్ చేసుకున్న తీరు భళా అనిపించింది. గోల్డెన్ రంగులోని హెయిర్ బ్యాండ్ లోకి శిరోజాలను బంతికట్టిన తీరు వహ్వా అనిపించింది. 

  • ఇది మూడోరోజు దీపిక ధరించిన డ్రెస్. పొడవైన ఎర్ర గౌనులో దీపిక అచ్చం దేవకన్యలా కనిపించింది. డైమండ్ గొలుసు, ఎర్ర లిప్ స్టిక్ కూడా ఆ డ్రెస్ కు మ్యాచ్ అయ్యాయి. 

  • ఇది ఆరో రోజు దీపిక ధరించిన డ్రెస్. ఇది నలుపురంగులోని లూయిస్ వ్యూటన్ స్లీవ్ లెస్ గౌన్. వీ ఆకారంలోని నెక్, ఈకల్లాంటి డిజైనింగ్ వల్ల ఈ డ్రెస్ డైనమిక్ గా కనిపించింది. డైమండ్ చెవిపోగులు, డై మండ్ ఉంగురాలు కూడా ఈ డ్రెస్ కు అదనపు ఆకర్షణను అద్దాయి. 

మరిన్ని వార్తలు..

బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోంది

స్వతంత్య్ర వీర్ సావర్కర్ ఫస్ట్ లుక్ రిలీజ్