రణ్ వీర్ కు దీపికా ఛాలెంజ్

రణ్ వీర్ కు దీపికా ఛాలెంజ్

బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలకు కేరాఫ్ గా ఉన్న స్టార్ కపుల్ రణ్ వీర్ సింగ్, దీపికా పదుకునే.. ది బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. షూటింగ్లతో పాటు, సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే దీపికా.. తాజాగా తన భర్త రణ్ వీర్ సింగ్ కు ఓ ఛాలెంజ్ ను విసిరి ట్రెండింగ్ గా నిలిచారు. 30 సెకన్లలో కొన్ని సాక్సులు వేసుకొని.. అంతే సమయంలో రణ్ వీర్ ఎన్ని సాక్సులు వేసుకుంటావు అంటూ సవాలు విసిరింది దీపికా. వీలైతే తనను బీట్ చేయమని చెప్తూ... సోషల్ మీడియా వేదికగా ఆమె ఛాలెంజ్ విసిరింది. దీంతో పాటు ఓ వీడియోను కూడా షేర్ చేయడంతో నెటిజన్లు ఆసక్తిగా ఈ వీడియోను వీక్షిస్తున్నారు.