
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ రికార్టులు బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ‘నాటు నాటు’ పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గ్లోబల్ అవార్డు సొంతం చేసుకుంది. మార్చి నెలలో ఆస్కార్ అవార్డ్స్ ప్రకటన రానుంది. దీని కోసం త్రిపుల్ ఆర్ టీం ఫుల్ జోష్తో వెయిటింగ్ చేస్తోంది. మరోవైపు జక్కన్న మహేష్ బాబుతో తన తదుపరి సినిమా కోసం సిద్దమౌతున్నాడు. ఈ క్రమంలో SSMB29 గురించి లేటెస్ట్ న్యూస్ వినిపిస్తున్నది.
ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనెను రాజమౌళి సంప్రదించారట. దీపిక ఓకే చెప్పిందా? లేదా? తెలియాల్సి ఉంది. ఆమె ఇప్పటికే పఠాన్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. రాజమౌళి డైరెక్టర్లో మహేష్, దీపిక జోడీతో సినిమా అంటే ఆ హైప్ వేరే కదా!. అడ్వైంచర్ మూవీగా ఈ చిత్రం రాబోతున్నదని స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ ఇదివరకే ప్రకటించారు. మూవీ బడ్జెట్ రూ.400 కోట్లు అని తెలుస్తోంది.