Deepika Padukone: 'డార్లింగ్'కు దీపికా పదుకొణె స్వీట్ విషెస్! 'మన సినిమా' అంటూ ఎమోషనల్ నోట్!

Deepika Padukone: 'డార్లింగ్'కు దీపికా పదుకొణె స్వీట్ విషెస్! 'మన సినిమా' అంటూ ఎమోషనల్ నోట్!

ఈ రోజు (అక్టోబర్ 23) పాన్-ఇండియా స్టార్, 'డార్లింగ్' ప్రభాస్‌కుపుట్టినరోజు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొణె (Deepika Padukone) చేసిన ప్రత్యేక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్‌ను డార్లింగ్‌గా సంబోధిస్తూ, ఆమె పంచుకున్న మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

దీపికా స్వీట్ విషెస్..

దీపికా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ... "హ్యాపీ బర్త్‌డే డార్లింగ్! మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. రాబోయే మీ సినిమాలన్నీ మెగా బ్లాక్‌బస్టర్‌లుగా నిలవాలని ఆశిస్తున్నాను. మీతో స్క్రీన్‌ను పంచుకునే అవకాశం లభించినందుకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞురాలిని. మా సినిమాను చూడటానికి అందరూ వేచి ఉండలేకపోతున్నారని తెలుసు." #HappyBirthdayPrabhas" అని పోస్ట్ చేసింది.

 

 ప్రభాస్ జోడీగా..

ప్రభాస్, దీపికా పదుకొణె మొదటిసారి కలిసి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD). వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో రూ. 600 కోట్లకు పైగా బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా రూపొదించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్‌లో ప్రభాస్ సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు నటించారు. ఈ పాన్ -ఇండియన్ చిత్రం గత  ఏడాది  జూన్ 27, 2024న  ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

 'కల్కి' సీక్వెల్ తప్పుకున్న దీపికా..

అయితే 'కల్కి 2898 AD' సీక్వెల్ నుండి దీపికా తప్పుకున్నారు. ఇది సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సినిమా నుంచి దీపికా వైదొలగడాన్ని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది. "మొదటి భాగం ప్రయాణం సుదీర్ఘంగా ఉన్నప్పటికీ, ఆమె నుంచి మాకు అవసరమైన భాగస్వామ్యం లభించలేకపోయింది. 'కల్కి 2898 AD' సీక్వెల్ వంటి సినిమాకు అత్యున్నత స్థాయి నిబద్ధత అవసరం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అని ఆ ప్రకటనలో పరోక్షంగా పేర్కొన్నారు.

అటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'స్పిరిట్'  చిత్రం నుండి కూడా ఆమె తప్పుకుంది. ఈ రెండు సినిమాల్లో తప్పుకోవడానికి  పారితోషికం, పని వేళల విషయంలో తీసుకున్న నిర్ణయాలు అని సినీ వర్గాల టాక్.  భారీ VFX పనులు అవసరమయ్యే 'కల్కి' వంటి ప్రాజెక్ట్‌కు ఇంత తక్కువ పని గంటలు కేటాయించడం, బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని నిర్మాతలు భావించినట్లు సమాచారం. ఈ డిమాండ్లే ఆమె నిష్క్రమణకు దారి తీశాయని అంటున్నారు.