షాకింగ్: 8 మంది మన నేవీ అధికారులకు ఖతార్ ఉరిశిక్ష

షాకింగ్: 8 మంది మన నేవీ అధికారులకు ఖతార్ ఉరిశిక్ష

ఎనిమిది మంది మాజీ భారత నావికాదళ అధికారులకు మరణ శిక్ష విధిస్తూ  ఖాతార్ కోర్టు తీర్పు చెప్పింది. ఈ విషయంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం గురయ్యామని భారత విదేశాంగ శాఖ గురువారం (అక్టోబర్ 26) తెలిపింది. నావీ అధికారుల మరణశిక్షపై ఆ దేశ అధికారులతో చర్చిస్తున్నామని తెలిపింది. 

కారణాలు చెప్పకుండా అరెస్ట్ చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న ఎనిమిది మంది మాజీ నావీ అధికారులకు  మరణశిక్ష విధిస్తూ ఖతార్ ఫస్ట్ ఇన్ స్టాన్స్ కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. కోర్టుతీర్పు భారత్, ఖతార్  మధ్య దౌత్య పరమైన వివాదానికి దారి తీసే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్త మవుతున్నాయి. భారత్ కు చెందిన మాజీ నావీ అధికారులు కెప్టెన్ నవజోత్ సింగ్ గిల్, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ పురేనేందు తివారీ, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, కమాండర్ అమిత్ నాగ్ పాల్, సెయిలర్ రాగేష్ లకు కోర్టు మరణి శిక్ష విధించింది. వీరు ఒమన్ దేశానికి చెందిన సెక్యూరిటీ కంపెనీ దహ్రా గ్లోబర్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లో పనిచేస్తున్నారు.

భారత నావీ అధికారులకు మరణ శిక్ష తీర్పుతో తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యాం.. వివరణాత్మక తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం.. అధికారుల కుటుంబ సభ్యులు, న్యాయ బృందంతో చర్చిస్తున్నాం.. చట్టపరమైన అవకాశాలను అన్వేశిస్తున్నాం’’ అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖతార్ అధికారులతో చర్చిస్తున్నాం.. మరణ శిక్ష విషయంలో చట్టపరమైన సాయం అందజేస్తామని తెలిపింది. 

2022 ఆగస్టు లో దోహాలోని ఖతార్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అధికారులు భారత నావికాదళ అధికారులపై సరైన కారణాలు తెలుపకుండా అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి జైలు ఉన్నారు మాజీ భారత నావికా దళ అధికారులు.