
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల రాష్ట్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకట స్వామి. అవినీతికి పాల్పడుతూ…తుగ్లక్ సీఎంగా వ్యవహరిస్తున్నారన్నారు. దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్ రావు ను కేసీఆర్ పోలీసులతో చాలా ఇబ్బందులు పెట్టారన్నారు.
ప్రభుత్వం,పోలీసుల తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష చేశారని…అయితే దుబ్బాకలో బీజేపీ గెలుపునకు ఆయన దీక్ష కూడా కారణంగా తెలిపారు. ప్రధాని మోడీ పథకాలకు ప్రజలు ఓట్లు వేస్తున్నారని..దుబ్బాక లో TRS కు ప్రజలు చెంప దెబ్బ కొట్టారన్నారు వివేక్ వెంకట స్వామి.
అంతేకాదు తాను కోటి రూపాయలు రఘునందన్ రావు కు పంపుతున్నట్లు కేసులు పెట్టారని…దీనిపై కేసీఆర్ పై డిఫమేషన్ కేసు వేస్తామని తెలిపారు వివేక్. ఇప్పటి వరకూ బీజేపీ నుంచి హైదరాబాద్ కు మేయర్ కాలేదని.. ఈసారి అవకాశం వచ్చిందన్నారు. బీజేపీని గెలిపించుకునేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. GHMC లో 100 డివిజన్ లు గెలుచుకోవాలని కార్యకర్తలకు సూచించారు వివేక్ వెంకట స్వామి.