లక్నోలో బ్రహ్మోస్ క్షిపణుల తయారీ.. 5 వేల మందికి జాబ్స్

లక్నోలో బ్రహ్మోస్ క్షిపణుల తయారీ.. 5 వేల మందికి జాబ్స్

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఖండాంతర అణు క్షిపణి అయిన బ్రహ్మోస్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దీని ద్వారా సుమారు 5 వేల మందికి పైగా ఉగ్యోగాలు వస్తాయని అన్నారు. తన సొంత నియోజకవర్గమైన లక్నోలో మంగళవారం ఉదయం రాజ్‌నాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రూ.1,710 కోట్లతో 180 అభివృద్ధి కార్యక్రమాలను లాంచ్ చేశారు.

అలాగే 90 వేర్వేరు ప్రాజెక్టులకు సంబంధించి ఈ రోజు ఉదయం రాజ్‌నాథ్ శంకుస్థాపన చేశారు. ఆయా డెవలప్‌మెంట్‌ పనులన్నీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, మెడికల్ అండ్ హెల్త్, ఇరిగేషన్‌, లక్నో మున్సిపల్ కార్పొరేషన్‌, లక్నో డెవలప్‌మెంట్ అథారిటీ, స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులకు సంబంధించినవి. ఈ సందర్భంగా యూపీ డిప్యూటీ సీఎం  దినేశ్ శర్మ మాట్లాడుతూ దేశంలోనే టాప్ సిటీలో ఒకటిగా ఉండాలని లక్నో డెవలప్‌మెంట్‌ గురించి  దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కలలు కన్నారని, వాటిని రాజ్‌నాథ్ సింగ్ నిజం చేస్తున్నారని అన్నారు.