లాస్ట్‌‌ బాల్‌‌కు సిక్స్‌‌.. ముంబై విక్టరీ

లాస్ట్‌‌ బాల్‌‌కు సిక్స్‌‌..  ముంబై విక్టరీ
  •     తొలి మ్యాచ్‌‌లో ఢిల్లీపై గెలుపు 
  •     రాణించిన యాస్తిక, హర్మన్

బెంగళూరు: విమెన్స్‌‌ ప్రీమియర్‌‌‌‌ లీగ్(డబ్ల్యూపీఎల్‌) రెండో  ఎడిషన్ అదిరిపోయే ఆటతో షురూ అయింది. చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం రాత్రి ఉత్కంఠగా సాగిన తొలి మ్యాచ్‌‌లో లాస్ట్‌‌ బాల్‌‌కు సిక్స్‌‌ కొట్టిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌‌ 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌‌పై  గెలిచి బోణీ చేసింది. యాస్తిక భాటియా (45 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 57), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (34 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 55) ఫిఫ్టీలతో రాణించడంతో ఢిల్లీ ఇచ్చిన 172 రన్స్ టార్గెట్‌‌ను ముంబై 6 వికెట్లు కోల్పోయి ఆఖరి బాల్‌‌కు  ఛేజ్ చేసింది.  

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌ 20 ఓవర్లలో 171/5 స్కోరు చేసింది. ఎలీస్ క్యాప్సీ (53 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 75), జెమీమా రోడ్రిగ్స్‌‌ (24 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 42) దంచికొట్టారు. ఓపెనర్ షెఫాలీ వర్మ (1) ఫెయిలైనా,  కెప్టెన్‌‌ మెగ్‌‌ లానింగ్ (31) రాణించింది. అనంతరం ఛేజింగ్‌‌లో ఇన్నింగ్స్ రెండో బాల్‌‌కే ఓపెనర్ హేలీ మాథ్యూస్ (0)ను కాప్ డకౌట్ చేసి షాకిచ్చినా సివర్ బ్రంట్‌‌ (19)తో రెండో వికెట్‌‌కు 50 రన్స్‌‌, మూడో వికెట్‌‌కు హర్మన్‌‌తో 56 రన్స్‌‌ జోడించిన యాస్తిక  స్కోరు వంద దాటించింది.

బ్రంట్‌‌తో పాటు భాటియాను ఔట్‌‌ చేసిన హైదరాబాదీ అరుంధతి ఢిల్లీని రేసులోకి తెచ్చింది. కానీ, హర్మన్, కెర్ (24)  నాలుగో వికెట్‌‌కు 28 బాల్స్‌‌లోనే 44 రన్స్‌ జోడించారు. అయితే, 18 ఓవర్లో కెర్‌‌‌‌ను బౌల్డ్‌‌ చేసిన శిఖా పాండే ఈ జోడీని విడదీసింది. చివర్లో ఓ సిక్స్, ఫోర్ కొట్టిన హర్మన్‌‌ లాస్ట్ ఓవర్ ఐదో బాల్‌‌కు ఔటైంది. చివరి బాల్‌‌కు ఐదు రన్స్‌‌ అవసరం అవగా కెర్ బౌలింగ్‌‌లో అరంగేట్రం క్రికెటర్  సంజన (6 నాటౌట్​) సిక్స్ కొట్టి ముంబైని గెలిపించింది.  హర్మన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.