9 నెలలుగా జీతాల్లేకుండా పని చేస్తున్న లెక్చరర్లు

9 నెలలుగా జీతాల్లేకుండా పని చేస్తున్న లెక్చరర్లు
  • అధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం
  • పెండింగ్​లో ఫైల్ .. ఇబ్బందుల్లో అధ్యాపకులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఒకటి, రెండు నెలలు కాదు..ఏకంగా 9 నెలల నుంచి  ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని గెస్ట్ లెక్చరర్లకు జీతాల్లేవు. రాష్ట్రంలో 132 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలున్నాయి.  లెక్చరర్ల కొరత నేపథ్యంలో 2018–19 సంవత్సరానికి అవర్లీ బేస్డ్‌ పై గెస్ట్‌‌‌‌ లెక్చరర్లను తీసుకోవాలని ప్రిన్సి పల్స్​కు గతేడాది జూలైలో కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశించారు. ఈ మేరకు 132 కాలేజీల్లో 863 మంది లెక్చరర్లను ఎంపిక చేశారు.వీరికి నెలకు 72 క్లాసు లు కేటాయించి , ఒక్కో క్లాసు కు రూ.300 చొప్పున ఇస్తామని  ప్రకటించా రు. ఈ లెక్కన ఒక లెక్చరర్‌ అన్ని క్లాసు లు తీసుకుంటే నెలకు రూ.21,600 జీతం వస్తుంది. కానీ.. ఇప్పటివరకు ఇవ్వలేదు. ఫైల్‌ పెండింగ్‌ లో ఉందని అధికారులంటున్నారు. చాలా మంది లెక్చరర్లు దూర ప్రాంతాలనుంచి వచ్చి, కాలేజీల్లో క్లాసులు తీసుకుంటున్నారు.నిత్యం కాలేజీకి రావడానికి వారికి వందల్లో  ఖర్చవుతోంది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారుతోందని, అప్పులు చేసి బతకాల్సి వస్తోందని గెస్ట్​ లెక్చరర్లు అంటున్నారు. వేతనాల ఫైల్‌ అప్రూవల్‌ కోసం కమిషరేట్‌ , సచివాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదని వాపోతున్నారు.

వెంటనే వేతనాలివ్వాలి

విద్యాసంవత్సరం ప్రారంభం నుం చి ఇప్పటి వరకు గెస్ట్​ లెక్చరర్లకు వేతనాలు రాలేదు. నెలల తరబడి వేతనాలు రాకపోతే కుటుంబాలను ఎలా పోషించుకుంటా రు?ఎన్ని రోజులు ఎంతమందిని అప్పులు అడుగుతారు? కళాశాల విద్యాశాఖాధికారులు వెం టనే స్పందిం చాలి.వేతనాలు అందించాలి.

– సీహెచ్‌ కిశోర్‌‌కుమార్‌‌,

డిగ్రీ లెక్చరర్స్‌ ఫోరం అధ్యక్షుడు