SIR లో పేరు తొలగిస్తే పౌరసత్వం పోయినట్లు కాదు: సుప్రీం కోర్టు కీలక ఆర్డర్

 SIR  లో పేరు తొలగిస్తే  పౌరసత్వం పోయినట్లు కాదు: సుప్రీం కోర్టు కీలక ఆర్డర్

ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సర్ ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తుందని వ్యాఖ్యానించిన సుప్రీం కోర్టు.. పౌరుల పౌరసత్వంపై కీలక వ్యాఖ్యలు చేసింది. సర్ లో పేరు తొలగిస్తే.. పౌరసత్వం పోయినట్లు కాదని చెప్పింది. 2026 మే 27న జస్టిస్ సుర్యకాంత్, జస్టిస్ జోమల్యా బాగ్చీ ధర్మాసనం.. సర్ ప్రక్రియపై ఈ కీలక ఉత్తర్వు జారీ చేసింది. 

ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న సర్ ప్రక్రియ పరోక్షంగా పౌరసత్వానికి సంబంధించి చేసే ప్రక్రియగా వస్తున్న ఆరోపణల క్రమంలో సుప్రీం కోర్టు ఉత్తర్వులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

  • సిటిజన్షిప్ పై సుప్రీం కోర్టు ఏం చెప్పింది..?

కేంద్ర ఎన్నికల సంఘం వ్యక్తుల పౌరసత్వాన్ని నిర్ణయిస్తుందా..? అనే ప్రశ్న ఇటీవలి కాలంలో ఉత్పన్నమవుతోంది. ఈ క్రమంలో సిటిజన్ షిప్ పై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. పౌరసత్వ నిర్ధారణ అంశంలో చేసే వెరిఫికేషన్ మాదిరిగానే ఎన్నికల కమిషన్ సర్వే చేస్తుందని.. కానీ అది ఎన్నికల లిస్టులో పేరు ఉండాలా తొలగించాలా అనే వరకే పరిమితం అవుతుందని బెంచ్ పేర్కొంది. 

భారత పౌరసత్వం కలిగి ఉన్న వ్యక్తులు.. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఎలక్ట్రోరల్ రోల్స్ లో వారి పేర్లు ఉండాలా వద్దా అనే వరకే సర్ ప్రక్రియ ఉంటుందని సుప్రీం కోర్టు చెప్పింది. ఈ ఇంక్వైరీ ద్వారా ఈసీకి వ్యక్తుల పౌరసత్వాన్ని నిర్ధారించే అధికారం లేదని తేల్చి చెప్పింది.