ఎలాగో చస్తాం.. మళ్లీ ఉరి శిక్షెందుకు: సుప్రీంలో నిర్భయ దోషి వింత పిటిషన్

ఎలాగో చస్తాం.. మళ్లీ ఉరి శిక్షెందుకు: సుప్రీంలో నిర్భయ దోషి వింత పిటిషన్
  • వింత వాదనలతో రివ్యూ ఫైల్ చేసిన అక్షయ్ సింగ్
  • పిటిషన్‌లో పేరాల కొద్దీ పురాణాలు, వేదాంతం కోట్స్

నిర్భయ రేప్, హత్య కేసులో దోషులకు త్వరలో ఉరి వేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో శిక్ష అమలు ఆలస్యం చేయాలని ప్లాన్ చేశారో.. లేక ప్రాణం పోతుందన్న భయం పట్టుకుందో ఏమో గానీ నిర్భయ కేసులో నలుగురు దోషుల్లో ఒకడైన అక్షయ్ సింగ్ వింత పిటిషన్‌తో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. తనకు శిక్ష తగ్గించాలని కోరుతూ రివ్యూ ఫైల్ చేశాడు. అందులో కోర్టుకు చెప్పిన కారణాలు చాలా వెరైటీగా ఉన్నాయి.

పిటిషన్‌లో వింత పాయింట్స్ ఇవీ..

  • ఢిల్లీలో కాలుష్యం చాలా  ఎక్కువైపోయింది. దేశ రాజధాని పరిస్థితి పొగ గూటిలో పెట్టినట్టుగా తయారైంది. నీటి కాలుష్యంతో తాగునీరు కూడా విషంగా మారింది. ఎలాగో ఈ కాలుష్యాలతో ఎక్కువ కాలం బతకడం కష్టం. మరి అలాంటప్పుడు ప్రత్యేకంగా ఉరి శిక్ష విధించడం ఎందుకు? నాకు శిక్ష తగ్గించండి.
  • జీవితం చాలా చిన్నదిగా అయిపోయింది. ఇలాంటి సమయంలో ఉరి శిక్షలు వేయాల్సిన అవసరం లేదు. చాలా దేశాల్లో మరణ శిక్షను రద్దు చేశారు. మనం కూడా దీనిపై రివ్యూ చేయాలి. పైగా నేను అమాయకుడిని, నన్ను అక్రమంగా ఈ కేసులో ఇరికించారు. నన్ను శిక్ష నుంచి తప్పించండి.
  • రివ్యూ పిటిషన్‌లో ఓ పేరా మరీ వింతగా ఉంది. అందులో వేదాలు, యుగాల గురించి ప్రస్తావించాడు దోషి తరఫు లాయర్. మన పురాణాలు, వేదాల ప్రకారం నాలుగు యుగాలు ఉంటాయి. వాటిలో తొలి యుగంలో మనుషులు జీవిత కాలం వెయ్యేళ్లు ఉండేది. కానీ, ఇప్పుడు మనం చివరిదైన కలియుగంలో ఉన్నాం. ఈ యుగంలో మనిషి జీవితకాలం 50 నుంచి 60 ఏళ్లకు తగ్గిపోయింది. పోనుపోనూ ఆయుషు తగ్గుతుంటే ఈ మరణ శిక్ష అవసరమేంటి?
  • ఇలా కొన్ని వింత కారణాలను ప్రస్తావిస్తూ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేశాడు నిర్భయ గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసులో దోషి అక్షయ్ కుమార్ సింగ్. అతడి పిటిషన్‌ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ యాక్సెప్ట్ చేసింది.

MORE NEWS:

రేప్‌లు జరగొద్దంటే..  మగవాళ్లు ఇలా చేయాలి

థియేటర్‌లోకి బయటి ఫుడ్ తీసుకెళ్లొచ్చు: అడ్డుకుంటే ఏం చేయాలి?

ఉరే సరైంది

2012 డిసెంబరు 16న ఢిల్లీలో ఓ యువతి (నిర్భయ)ని కిడ్నాప్ చేసి రన్నింగ్ బస్సులో ఆరుగురు కలిసి దారుణంగా రేప్ చేశారు. అత్యాచారం చేస్తూ పైశాచికంగా హింసించి.. రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఆమె చికిత్స పొందుతూ 2012 డిసెంబరు 29న మరణించింది. ఈ కేసులో ఆరుగురు నిందితులు రామ్ సింగ్(33), ముకేష్ సింగ్(24), , వినయ్ శర్మ(22), పవన్ గుప్తా(20) , అక్షయ్ ఠాకూర్(29), మరో మైనర్ నిందితుడు మహ్మద్ అఫ్రోజ్(17సంవత్సరాల 6నెలలు)ను పోలీసులు అరెస్టు చేశారు.

అఫ్రోజ్ మైనర్ కావడంతో జువైనల్ కోర్ట్  మూడు సంవత్సరాల జైలుశిక్షతో బయటపడ్డాడు. ప్రధాన నిందితుడు రామ్ సింగ్ 2013మార్చ్ 11న తీహార్ జైల్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురు నిందితులైన ముకేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్ లకు ఉరిశిక్షే సరైందని ట్రయల్ కోర్టు 2013 సెప్టెంబర్ 13న తీర్పు చెప్పింది. 2017 మే 5న ట్రయల్ కోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దిశ కేసు సంచలనమైన తర్వాత నిర్భయ దోషులు నలుగురికి త్వరలోనే ఉరి వేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.