అన్నా హజారేను తమతో కలవాలని కోరిన ఢిల్లీ బీజేపీ చీఫ్

అన్నా హజారేను తమతో కలవాలని కోరిన ఢిల్లీ బీజేపీ చీఫ్

సామాజిక కార్యకర్త అన్నా హజారేను తమతో కలవాలని కోరుతూ ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆయనకు లేఖ రాశారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పార్టీ చేస్తున్న ప్రజా ఉద్యమంలో చేరాలని ఢిల్లీ బీజేపీ చీఫ్ అదేష్ గుప్తా విజ్ఞప్తి చేశారు. ఆప్ ప్రభుత్వం రాజకీయ విలువలను పూర్తిగా దిగజార్చిందని ఆదేష్ గుప్తా అన్నారు. ఆప్ వల్లే ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో హింస చెలరేగిందని ఆయన అన్నారు. ఆ గొడవల వల్ల 53 మంది మరణించగా.. దాదాపు 200 మంది గాయపడ్డారని ఆయన అన్నారు.

‘స్వచ్ఛమైన మరియు న్యాయమైన రాజకీయాల పేరుతో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ.. రాజకీయ విలువలను పూర్తిగా దిగజార్చింది. ఆప్ వల్ల ఢిల్లీ ప్రజలు మతపరమైన అల్లర్లను ఎదుర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక అవినీతిపై మేం నిరంతరం పోరాడుతున్నాం. అందువల్ల మీరు కూడా ఢిల్లీకి వచ్చి ఆప్ అవినీతికి వ్యతిరేకంగా గొంతుకలిపి.. మాకు మద్దతు ఇవ్వమని మేం అభ్యర్థిస్తున్నాము. ఢిల్లీ ప్రజల కోసం అన్నా హజారే మళ్లీ తన గొంతును వినిపించాల్సిందిగా కోరుతున్నాం’అని ఆదేష్ గుప్తా తన లేఖలో పేర్కొన్నారు.

For More News..

దేశంలో 24 గంటల్లో 60,975 కరోనా కేసులు

మీఊర్లో ఎయిర్ పొల్యూషన్ ఎంతుందో తెలుసా?

రాష్ట్రంలో మరో 2,579 కరోనా పాజిటివ్ కేసులు

వరుసగా నాలుగో రోజూ దిగిన బంగారం రేట్లు