టాప్‌‌ ప్లేస్‌‌తో ఫైనల్‌‌కు..ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌

టాప్‌‌ ప్లేస్‌‌తో ఫైనల్‌‌కు..ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌
  • ఆఖరి మ్యాచ్‌‌లో గుజరాత్‌‌పై గెలుపు
  • దంచికొట్టిన షెఫాలీ, జెమీమా

న్యూఢిల్లీ: ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్‌‌‌‌‌‌‌‌ షోతో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌.. వరుసగా రెండోసారి డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో షెఫాలీ వర్మ (37 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 71), జెమీమా రోడ్రిగ్స్‌‌‌‌‌‌‌‌ (28 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 38 నాటౌట్‌‌‌‌‌‌‌‌) చెలరేగడంతో.. బుధవారం జరిగిన ఆఖరి లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్‌‌‌‌‌‌‌‌ జెయింట్స్‌‌‌‌‌‌‌‌కు చెక్‌‌‌‌‌‌‌‌ పెట్టింది.

టాస్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన గుజరాత్‌‌‌‌‌‌‌‌ 20 ఓవర్లలో 126/9 స్కోరు చేసింది. భారతి ఫుల్మాలి (42), కేథరిన్‌‌‌‌‌‌‌‌ బ్రైస్‌‌‌‌‌‌‌‌ (28), లిచ్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ (21) రాణించారు. తర్వాత ఢిల్లీ 13.1 ఓవర్లలోనే 129/3 స్కోరు చేసి నెగ్గింది. షెఫాలీకి ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. ఆడిన 8 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు నెగ్గి టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌తో ఢిల్లీ ఫైనల్ చేరింది. 2,3వ స్థానాల్లో నిలిచిన ముంబై, ఆర్‌‌‌‌సీబీ మధ్య శుక్రవారం జరిగే ఎలిమినేటర్‌‌‌‌ మ్యాచ్‌‌ విన్నర్‌‌‌‌తో ఆదివారం ఫైనల్లో ఢిల్లీ తలపడనుంది. 

భారతి మినహా..

ముందుగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన గుజరాత్‌‌‌‌‌‌‌‌ను డీసీ బౌలర్లు కట్టడి చేశారు. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఆరో బాల్‌‌‌‌‌‌‌‌కు బెత్‌‌‌‌‌‌‌‌ మూనీ (0)ని కాప్‌‌‌‌‌‌‌‌ (2/17) ఔట్‌‌‌‌‌‌‌‌ చేసింది. 4వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో హేమలత (4)ను జొనాసెన్‌‌‌‌‌‌‌‌ (1/32) పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు పంపింది. ఆ వెంటనే ఐదో ఓవర్‌‌‌‌‌‌‌‌లో కాప్‌‌‌‌‌‌‌‌ దెబ్బకు లారా వోల్‌‌‌‌‌‌‌‌వర్త్‌‌‌‌‌‌‌‌ (7) ఔట్‌‌‌‌‌‌‌‌ కావడంతో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలో గుజరాత్‌‌‌‌‌‌‌‌ 23/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో వచ్చిన లిచ్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌, గార్డ్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ (12) ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు.

గార్డ్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ ఫోర్‌‌‌‌‌‌‌‌తో ఖాతా తెరవగా, ఆ వెంటనే లిచ్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ కూడా బౌండ్రీ బాదింది. కానీ 9వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో మిన్ను మణి (2/9) దెబ్బకు గార్డ్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చుకోవడంతో నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు 23 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ముగిసింది. దీంతో 42/4 స్కోరు జీజీ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టెన్‌‌‌‌‌‌‌‌ ఓవర్స్‌‌‌‌‌‌‌‌ను ముగించింది. 11వ ఓవర్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ను సిక్స్‌‌‌‌‌‌‌‌గా మలిచిన లిచ్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ తర్వాతి బాల్‌‌‌‌‌‌‌‌కు క్లీన్‌‌‌‌‌‌‌‌బౌల్డ్‌‌‌‌‌‌‌‌ అయ్యింది. ఇక 50/5 స్కోరు మరింత కష్టాల్లో పడిన గుజరాత్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను భారతి ఫుల్మాలి కాపాడింది.

కాప్‌‌‌‌‌‌‌‌, రాధా యాదవ్‌‌‌‌‌‌‌‌  ఓవర్లలో నాలుగు ఫోర్లతో చెలరేగింది. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో బ్రైస్‌‌‌‌‌‌‌‌ వేగంగా సింగిల్స్‌‌‌‌‌‌‌‌ తీసింది. 15 ఓవర్లలో మరో రెండు ఫోర్లు కొట్టడంతో గుజరాత్‌‌‌‌‌‌‌‌ 82/5తో కాస్త తేరుకుంది. కానీ ఇక్కడి నుంచి డీసీ బౌలర్లు మళ్లీ పట్టుబిగించారు. భారీ షాట్లను ఆడ్డుకోవడంతో బౌండ్రీల రాక తగ్గింది. భారతి, బ్రైస్‌‌‌‌‌‌‌‌ చెరో ఫోర్‌‌‌‌‌‌‌‌ మాత్రమే కొట్టారు. 19వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో వరుస బాల్స్‌‌‌‌‌‌‌‌లో భారతి, తనూజ కన్వర్‌‌‌‌‌‌‌‌ (0)ను.. శిఖా పాండే (2/23) పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు పంపింది. దీంతో ఆరో వికెట్‌‌‌‌‌‌‌‌కు 68 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ముగిసింది. ఆఖరి ఓవర్‌‌‌‌‌‌‌‌లో షబ్నిమ్‌‌‌‌‌‌‌‌ షకీల్‌‌‌‌‌‌‌‌ (1), మేఘనా సింగ్‌‌‌‌‌‌‌‌ (4) ఔట్‌‌‌‌‌‌‌‌కావడంతో గుజరాత్‌‌‌‌‌‌‌‌ చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌కే పరిమితమైంది. 

షెఫాలీ, రోడ్రిగ్స్‌‌‌‌‌‌‌‌ అదుర్స్‌‌‌‌‌‌‌‌..

ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ఆరంభం నుంచే డీసీ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ఓపెనర్లు లానింగ్‌‌‌‌‌‌‌‌ (18), షెఫాలీ తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 19 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 31 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి మెరుపు ఆరంభాన్నిచ్చారు. కానీ ఐదు బాల్స్‌‌‌‌‌‌‌‌ తేడాలో లానింగ్‌‌‌‌‌‌‌‌, క్యాప్సీ (0) ఔట్‌‌‌‌‌‌‌‌ కావడంతో స్కోరు 31/2గా మారింది. ఇక్కడి నుంచి షెఫాలీ, రోడ్రిగ్స్‌‌‌‌‌‌‌‌ విశ్వరూపం చూపెట్టారు. భారీ హిట్టింగ్‌‌‌‌‌‌‌‌తో గుజరాత్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ను ఉతికేశారు. ఐదు భారీ సిక్సర్లు కొట్టిన షెఫాలీ 28 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ పూర్తి చేసింది. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో రోడ్రిగ్స్‌‌‌‌‌‌‌‌ కూడా ఎక్కడా తగ్గలేదు. ఓవర్‌‌‌‌‌‌‌‌కు ఓ ఫోర్‌‌‌‌‌‌‌‌ కొడుతూ షెఫాలీకి అండగా నిలిచింది. ఈ ఇద్దరు మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 55 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే 94 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి ఈజీగా విజయాన్ని అందించారు. తనూజ కన్వర్‌‌‌‌‌‌‌‌ రెండు వికెట్లు తీసింది. 

సంక్షిప్త స్కోర్లు

గుజరాత్‌‌‌‌‌‌‌‌: 20 ఓవర్లలో 126/9 (భారతి 42, కాప్‌‌‌‌‌‌‌‌ 2/17). ఢిల్లీ: 13.1 ఓవర్లలో 129/3 (షెఫాలీ 71, జెమీమా 38*, కన్వర్‌‌‌‌‌‌‌‌ 2/20).