రఫ్పాడించిన రోసో , షా మెరుపులు... పంజాబ్కు భారీ టార్గెట్

రఫ్పాడించిన రోసో , షా మెరుపులు... పంజాబ్కు భారీ టార్గెట్

ఢిల్లీ బ్యాటర్లు దుమ్ము రేపారు. పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచులో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. ఎడా పెడా సిక్సులు ఫోర్లు బాదడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపటల్స్ కు ఓపెనర్లు వార్నర్, పృథ్వీ షా..అద్బుతమైన ఆరంభాన్నిచ్చారు. పృథ్వి షా 38 బంతుల్లో 1 సిక్స్, 7 ఫోర్లతో 54 పరుగులు చేయగా..వార్నర్ 31 బంతుల్లో 2 సిక్సర్లు, 5 ఫోర్లతో 46 రన్స్ సాధించాడు. వీరిద్దరు  తొలి వికెట్ కు 94 పరుగులు జోడించారు. అయితే సామ్ కర్రన్ బౌలింగ్ లో వార్నర్ (46) ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రొస్సో  మరింత రెచ్చిపోయాడు. పృథ్వి షాతో కలిసి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఇదే క్రమంలో రెండో వికెట్కు 54 పరుగులు జోడించారు. అయితే 54  పరుగులు చేసిన షాను సామ్ కర్రన్ పెవీలియన్ చేర్చాడు. 

రెచ్చిపోయిన రోసో 

ఓపెనర్లు ఇద్దరూ ఔటైనా రోసో చివర్లో రెచ్చిపోయాడు. ధనాధన్ ఇన్నింగ్స్తో జట్టుకు భారీ స్కోరును అందించాడు. కేవలం 37 బంతుల్లో 6 సిక్సర్లు, 6 ఫోర్లతో 82 పరుగులు సాధించాడు. ఇతనికి సాల్ట్ 14 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్ తో 26 పరుగులు చేసి సహకరించడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 2 వికెట్లకు 213 పరుగులు సాధించింది. పంజాబ్ బౌలర్లలో సామ్ కర్రన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.