WPL2023: దుమ్మురేపిన ఢిల్లీ..ఆర్సీబీకి 224 పరుగుల టార్గెట్

WPL2023: దుమ్మురేపిన ఢిల్లీ..ఆర్సీబీకి 224 పరుగుల టార్గెట్

మహిళల ప్రీమియర్ లీగ్ రెండో మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్ము రేపింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచులో 20 ఓవర్లలో  కేవలం 2 వికెట్లు కోల్పోయి 223 పరుగుల భారీ స్కోరు చేసింది.  టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ ఆరంభం నుంచి సిక్సులు, ఫోర్లతో చెలరేగింది. ఓపెనర్లు మెగ్ లాన్నింగ్, షఫాలీ వర్మ  పోటీ పడి మరీ ఆడారు. తొలి వికెట్ కు ఏకంగా 162 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇదే క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించారు. వీరిద్దరు వెంట వెంటనే  ఔటయ్యారు. ఆ తర్వాత  క్రీజులోకి వచ్చిన మరిజన్నే కప్, రోడ్రిగేజ్ చిచ్చరపిడుగుల్లా ఆడారు. మూడో వికెట్ కు అజేయంగా 60 పరుగులు జోడించడంతో  ఢిల్లీ భారీ స్కోరు నమోదు చేసింది.  ఆర్సీబీ బౌలర్లలో హేతర్ నైట్ రెండు వికెట్లు పడగొట్టింది.