DC vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో భాగంగా జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఉత్కంఠ పోరు కొనసాగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ సారథి అక్షర్ పటేల్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో పంజాబ్ జట్టు ఫస్ట్ బౌలింగ్ చేసేందుకు బరిలోకి దిగబోతుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఢిల్లీకి ఈ మ్యాచ్ అత్యంత కీలకం కాగా.. మరి అక్షర్ పటేల్ వ్యూహం ఫలించి ఢిల్లీ మళ్ళీ విజయాల బాట పడుతుందో లేదో అనేది వేచి చూడాలి.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. మేము ముందుగా బ్యాటింగ్ చేస్తాం.. వాతావరణం చాలా వేడిగా ఉంది, కాబట్టి మంచి స్కోరు బోర్డుపై ఉంచి దాన్ని డిఫెండ్ చేసుకోవాలని భావిస్తున్నాం.. ఆట సాగుతున్న కొద్దీ పిచ్ నెమ్మదించే అవకాశం ఉంది.. టోర్నీలో అన్ని జట్లు బాగా ఆడుతున్నాయి, మేము కూడా మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం.. కానీ కీలక సమయాల్లో చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల విజయాలకు దూరమవుతున్నాం.. ఆ లోపాలను సరిదిద్దుకుని ఈ మ్యాచ్‌లో రాణించడమే మా ప్రధాన లక్ష్యం.. ఈ మ్యాచ్ కోసం మేము జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదని పటేల్ వెల్లడించాడు.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.. గత మ్యాచ్‌లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది.. మేము సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలనుకుంటున్నాం.. ప్రస్తుతానికి అంతా బాగుంది.. ఈ పిచ్‌పై నేను కూడా ముందుగా బౌలింగ్ చేయడానికే ఇష్టపడేవాడిని.. మేము కూడా పాత జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని పేర్కొన్నాడు.
తుది జట్లు:
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
ఢిల్లీ క్యాపిటల్స్: KL రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, కులదీప్ యాదవ్, T నటరాజన్, ముఖేష్ కుమార్
🚨 TOSS 🚨@DelhiCapitals have won the toss & will bat first against @PunjabKingsIPL in New Delhi.
— IndianPremierLeague (@IPL) April 25, 2026
Updates ▶️ https://t.co/0oSkMZgNAV#TATAIPL | #KhelBindaas | #DCvPBKS pic.twitter.com/jKNpfCh1lo

