న్యాయ వ్యవస్థలో దేశానికే ఆదర్శం

V6 Velugu Posted on May 13, 2022

న్యూఢిల్లీ: రాష్ట్ర న్యాయ వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని ఆప్ అధినేత,  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. శుక్రవారం కర్కార్దూమా కోర్టు నూతన భవనాన్ని సీఎం కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేశారు. లాయర్ల సంక్షేమం కోసం బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నామన్న ఆయన.... ప్రతి లాయర్ కు హెల్త్ ఇన్సూరెన్స్ కింద రూ.5 లక్షలు, జీవిత బీమా కింద రూ.10 లక్షల అందిస్తున్నామన్నారు. ఇప్పటికే దాదాపు 30 వేల మంది లాయర్లు ఈ పథకానికి అప్లై చేసుకున్నారన్నారు. 

మరిన్ని వార్తల కోసం...

బిల్లుల కోసం ప్రభుత్వంపై TRS ఎంపీటీసీ నిరసన

కాంగ్రెస్ చాలా ఇచ్చింది.. తిరిగి ఇచ్చేయండి

Tagged cm, new Delhi, Aravind kejriwal, Lawyers, AAP, incurance

Latest Videos

Subscribe Now

More News