
సింగపూర్‌లో మరో కొత్త కరోనా వేరియంట్ బయట పడటంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వేరియంట్స్ తో చిన్నారులకు తీవ్ర ముప్పు ఉందని రుజువైందని అన్నారు. దీంతో దేశంలో థర్డ్ వేవ్ రావచ్చన్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని.. ముఖ్యంగా సింగపూర్ నుండి వచ్చే విమాన ప్రయాణాలపై నిషేధం విధించాలని ప్రధాని మోడీని కోరారు. సింగ్‌పూర్‌లో కొత్త రూపం దాల్చిన వైరస్ పిల్లలకు చాలా ప్రమాదకరమని చెబుతున్నారన్నారన్న కేజ్రీవాల్.. సింగ్‌పూర్‌కు విమాన సర్వీసులపై నిషేధం విధించాలి.. పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందించే ప్రాధాన్యతపై దృష్టిసారించాలని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. థర్డ్ వేవ్ వస్తే చిన్నారులపై మరింత ప్రభావం చూపుతుందన్న నివేదికలు వెలువడుతున్న క్రమంలో సీఎం కేజ్రీవాల్ ఈ ట్వీట్ చేశారు.
सिंगापुर में आया कोरोना का नया रूप बच्चों के लिए बेहद ख़तरनाक बताया जा रहा है, भारत में ये तीसरी लहर के रूप में आ सकता है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 18, 2021
केंद्र सरकार से मेरी अपील:
1. सिंगापुर के साथ हवाई सेवाएं तत्काल प्रभाव से रद्द हों
2. बच्चों के लिए भी वैक्सीन के विकल्पों पर प्राथमिकता के आधार पर काम हो